UPI Transactions: యూపీఐ యాప్స్ వాడేవారికి బ్యాడ్‌ న్యూస్.. త్వరలో మారనున్న రూల్స్.. బాదుడే బాదుడు

యూపీఐ యాప్స్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్. యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్లలో మెసాలను అరికట్టే దిశగా కొన్ని రూల్స్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. వాటి వివరాలు ఇలా..

UPI Transactions: యూపీఐ యాప్స్ వాడేవారికి బ్యాడ్‌ న్యూస్.. త్వరలో మారనున్న రూల్స్.. బాదుడే బాదుడు
Upi 4

Updated on: Dec 30, 2025 | 4:59 PM

డిజిటల్ లావాదేవీలు సులువుగా నిర్వహించుకునేందుకు ప్రతీఒక్కరూ యూపీఐ యాప్‌లు వాడుతున్నారు. బ్యాంకులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కస్టమర్లను ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకులు తమ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసే ఆప్షన్ తీసుకురాగా.. ఇక మార్కెట్లో గూగుల్ పే, ఫోన్ పే, క్రెడ్, పేటీఏం అమెజాన్ పే, మోబిక్విక్ లాంటి అనేక యాప్స్ సర్వీసులు అందిస్తున్నాయి. బ్యాంకింగ్ యాప్స్ కంటే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఏం లాంటి యాప్స్‌నే ఎక్కువమంది వాడుతున్నారు. దేశంలో ప్రతీ ఏడాది యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఆర్బీఐ ఆదేశాలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) పలు మార్పులు తీసుకొస్తోంది. త్వరలో మరికొన్ని మార్పులను అమలు చేసేందుకు సిద్దమవుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

రానున్న కొత్త నియమాలు ఇవే

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్స్‌కు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. భవిష్యత్తులో డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీలకు ఛార్జించే విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రూ.2 వేలకు మంచి చేసే లావేదేవీలపై ఛార్జీలు విధించనున్నారని తెలుస్తోంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కొత్త ఏడాదిలో ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇది అమల్లోకి వస్తే యూపీఐ వినియోగదారులపై భారం పడనుంది

ఓటీపీ వెరిఫికేషన్

రూ.50 వేలపైన చేసే లావాదేవీలకు ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి చేయనున్నారు. ప్రస్తుతం మనం యూపీఐ పిన్ ఎంటర్ చేసి లావాదేవీలు చేసుకుంటున్నాం. కానీ మోసపూరిత లావాదేవీలను అరికట్టేందుకు రూ.50 వేలకు మించి చేసే ట్రాన్సక్షన్లకు ఓటీపీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. దీని వల్ల యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపాలంటే ఓటీపీ ధృవీకరించాల్సి ఉంటుంది. యాప్ సబ్‌స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లు వంటి వాటికి రూ.10 వేలకు మించి చెల్లించాలన్నా ఓటీపీ నిర్ధారణ చేయాల్సి రావొచ్చు. యూపీఐ ద్వారా ప్రజలు సురక్షితంగా, పారదర్శకతతో ట్రాన్సాక్షన్లు నిర్వహించుకునేందుకు త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.