Bank Account: మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకుండా ఇనాక్టివ్ అయిందా..? ఈ సింపుల్ పని చేస్తే క్షణాల్లోనే యాక్టివ్‌లోకి..

ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే ఇనాక్టివ్ అవుతుందనే విషయం మనందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటప్పుడు డెబిట్ కార్డు, ఆన్ లైన్ సేవలు కూడా బంద్ అవుతాయి. అప్పుడు మళ్లీ అకౌంట్ వాడాలంటే ఏం చేయాలంటే..

Bank Account: మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకుండా ఇనాక్టివ్ అయిందా..? ఈ సింపుల్ పని చేస్తే క్షణాల్లోనే యాక్టివ్‌లోకి..

Updated on: Dec 29, 2025 | 5:45 PM

వేర్వేరు అవసరాల దృష్ట్యా ప్రస్తుత కాలంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వాడుతున్నారు. శాలరీ రీత్యా ఒక అకౌంట్, వ్యక్తిగత అవసరాల కోసం మరో అకౌంట్ వాడుతూ ఉంటారు. ఇక స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేవారు అందుకోసం మరో ప్రత్యేక అకౌంట్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వ్యాపారులు బిజినెస్ లావాదేవీల కోసం కరెంట్ అకౌంట్ లాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా వేర్వేరు అవసరాల కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను వాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అవసరం లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఒకే అకౌంట్‌ను వాడుతూ మిగతా అకౌంట్లను పట్టించుకోవడం మానేస్తారు.

రెండేళ్లు ఉపయోగించకుండా ఉంటే..?

రెండేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగించకుండా లేదా ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకుండా ఉంటే ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఇనాక్టివ్ చేస్తోంది. కొన్ని బ్యాంకులు అయితే ఒక సంవత్సరం ఎలంటి లావాదేవీలు నిర్వహించకపోతే ఇనాక్టివ్‌గా చేస్తున్నాయి. ఆ గడువులోగా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయడమో లేదా విత్ డ్రా చేయడమో, ఏటీఎం ఉపయోగించడమో లాంటి ఏదోక లావాదేవీ నిర్వహించాలి. లేకపోతే బ్యాంకులు అకౌంట్‌ పనిచేయకుండా ఇనాక్టివ్ లేదా డార్మాంట్ చేస్తూ ఉంటాయి. ఇలా చేస్తే మీరు అకౌంట్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అలాగే డెబిట్ కార్డు కూడా పనిచేయదు. ఆన్‌లైన్ లావాదేవీలు నిలిపివేయడంతో పాటు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అకౌంట్ ఇనాక్టివ్ అయితే ఏం చేయాలి..?

అకౌంట్ ఇనాక్టివ్ అయినంత మాత్రాన మీ అకౌంట్ ఎక్కడికి పోదు. మీ అకౌంట్లోని డబ్బులు కూడా అలాగే ఉంటాయి. మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్, పాన్ లేదా ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం చూపించి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయగానే మీ అకౌంట్ వెంటనే యాక్టివ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పటిలాగే బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. అందులో ఏమైనా డబ్బులు ఉన్నా విత్ డ్రా చేసుకోవచ్చు.