
PAN Address Update: ఇప్పట్లో పాన్ కార్డు అనేది అందరికీ అవసరమే. పాన్ కార్డు లేనిది ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు భారత్‌లో నిర్వహించలేము. బ్యాంక్ సర్వీసులు పొందాలన్నా, మీ శాలరీ పొందాలన్నా పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇక వివిధ పనులకు గుర్తింపు ధృవీకరణ పత్రంగా పాన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇక ఉద్యోగులు, వ్యాపారులు ట్యాక్స్ ఫైలింగ్ చేయాలన్నా పాన్ కార్డు అనేది అవసరం. మీరు ఇల్లు మారినప్పుడు లేదా వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు పాన్ కార్డులో పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో మీ ఇంటి వద్ద నుంచే పాన్ కార్డులో అడ్రస్ మార్చుకోవచ్చు. ఎలా అంటే..
-NSDL పోర్టల్‌లోకి వెళ్లి “చేంజ్ లేదా కరకెక్షన్ ఇన్ పాన్ డేటా” అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-ఆధార్ బేస్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్‌ను ఎంచుకుండి
-ఆధార్ మొబైల్ నెంబర్ వచ్చే ఓటీపీని నిర్ధారించండి
-మీ ఆధార్‌లో ఉన్న అడ్రస్ ఇప్పుడు పాన్ కార్డులో అప్‌డేట్ అవుతుంది
-మీకు వచ్చే రిఫరెన్స్ నెంబర్‌ను సేవ్ చేసుకుని స్టేటస్‌ను చెక్ చేసుకోండి
-కానీ దీని కోసం మీరు మీ ఆధార్ కార్డు అడ్రస్‌ను మార్చుకుని ఉండాలి
ఆన్‌లైన్‌లో మీరు పాన్ కార్డు అడ్రస్ మార్చుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ అయ్యి ఉండాలి. ఆధార్-పాన్ లింక్ అయ్యి ఉండాలి. అలాగే ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
పాన్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి రూ.96 చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా మీరు చెల్లించవచ్చు. అప్డేట్ అవ్వగానే వెంటనే మీరు ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక 10 నుంచి 15 రోజుల్లో మీ అడ్రస్‌కు ఫిజికల్ కార్డు పోస్టు ద్వారా పంపిస్తారు.