Cibil Score Tips: సిబిల్ స్కోర్ తక్కువుండి లోన్లు, క్రెడిట్ కార్డులు రావడం లేదా..? నో వర్రీ.. ఈ పనులు చేస్తే మీ ఇబ్బందులు పరార్

అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంక్ నుంచి లోన్ల కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు. కానీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు ఏ బ్యాంక్ నుంచి లోన్ రాదు. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సిబిల్ స్కోర్‌ను మెరుగుపర్చుకోవడానికి అనేక చిట్కాలు ఉన్నాయి.

Cibil Score Tips: సిబిల్ స్కోర్ తక్కువుండి లోన్లు, క్రెడిట్ కార్డులు రావడం లేదా..? నో వర్రీ.. ఈ పనులు చేస్తే మీ ఇబ్బందులు పరార్
Credit Card And Cibil Score

Updated on: Dec 26, 2025 | 7:48 AM

దేశంలోని ప్రతీ వ్యక్తి ఆర్ధికంగా ఏ పరిస్ధితుల్లో ఉన్నారనేది సిబిల్ స్కోర్‌ను చూసి సులువుగా తెలుసుకోవచ్చు. ఆర్ధిక పరంగా క్రెడిట్ స్కోర్ అనేది అందరికీ ముఖ్యమే. లేకపోతే ఎలాంటి లోన్లు, క్రెడిట్ కార్డులు మనం పొందలేము. ఇంతేకాకుండా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు తక్కువ వడ్డీకి బ్యాంక్ నుంచి లోన్లు వస్తాయి. ఇతరులతో పోలిస్తే క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. అంతేకాకుండా మిగతావారితో పోలిస్తే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నవారికి త్వరగా లోన్లు, క్రెడిట్ కార్డులను బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇలా క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

సిబిల్ స్కోర్ స్థాయి అనేది 300 నుంచి 900 మధ్య లెక్కిస్తారు. 800 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారిని ఎక్సలెంట్ కేటగిరీ క్రింద పరిగణిస్తారు. అదే 700 నుంచి 800 మధ్యలో ఉంటే మధ్య స్థాయికి గుర్తిస్తారు. అంతకంటే తక్కువ ఉన్నవారిని తక్కువ స్ధాయిలో ఉన్నవారిగా పరిగణిస్తారు. 800పైన క్రెడిట్ స్కోర్ కలిగిన ఉన్నవారు దేశంలో 10 నుంచి 20 శాతం మధ్య ఉన్నారు. ఇక ఎక్కువమంది 700 నుంచి 800 మధ్య కలిగి ఉన్నారు. ఆర్ధిక విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నవారు, ధనవంతులు మాత్రమే 800పైన సిబిల్ స్కోర్ కలిగి ఉన్నారు.

800కి చేరుకోవాలంటే..?

మన సిబిల్ స్కోర్ కూడా 800కి చేరుకునేలా చేసుకోవచ్చు. లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు డ్యూ డేట్ కల్లా చెల్లిస్తే మీ స్కోర్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 30 శాతానికి మించకూడదు. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.లక్ష ఉందనుకుంటే అందులో మీరు 30 శాతం కంటే తక్కువ అమౌంట్‌ను మాత్రమే వాడుకోవాలి. ఇక పర్సనల్ లోన్, స్టూడెంట్ లోన్, క్రెడిట్ కార్డులను ఇన్‌సెక్యూరిటీ లోన్లుగా పరిగణిస్తారు. ఇక హోమ్ లోన్, వెహికల్, గోల్డో లోన్స్‌ను హామీ రుణాలుగా గుర్తిస్తారు. ఈ రెండు లోన్లు మిక్స్ ఉండేలా చూసుకోండి. ఇక రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేని సమయంలో సెటిల్‌మెంట్ చేసుకుంటే సిబిల్ స్కోర్ భారీగా పడిపోతుంది. ఇక రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం ఎక్కువగా అప్లై చేసుకోకూడదు. ఇవి సరిగ్గా పాటిస్తే మీ సిబిల్ స్కోర్ కూడా 800కిపైగా పెరుగుతంది,