LIC Policy: ధనవంతులు కావడానికి అద్భుతమైన ఆఫర్.. కేవలం రూ. 70 పెట్టుబడిపై మీకు రూ. 48 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

|

Dec 16, 2022 | 3:25 PM

మీరు మీ మంచి భవిష్యత్తు కోసం అలాంటి పొదుపు పథకం కోసం చూస్తున్నారా.. దీనిలో మీరు తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. దీంతో మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వ పథకం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..

LIC Policy: ధనవంతులు కావడానికి అద్భుతమైన ఆఫర్.. కేవలం రూ. 70 పెట్టుబడిపై మీకు రూ. 48 లక్షలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
Follow us on

ఆర్ధిక భవిష్యత్తుపై ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవల్సిన అవసరం ఉంది. అయితే మీరు ఎంచుకునే ఆర్ధిక ప్రణాళిక మేరకు మీకు మంచి లాభాలు వస్తుంటాయి. ముఖ్యంగా అనిశ్చితి సమయంలో, భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికను రూపొందించడం సరైనది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాలైన పథకాలను పోస్టాఫీసులు, ఎల్ఐసీ, బ్యాంకుల మాధ్యమంగా ప్రజల్లోకి తీసుకొస్తోంది. అయితే ఈ  ప్రభుత్వం పథకం గురించి కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం. దీనిలో మీరు రోజువారీగా రూ. 70 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ. 48 లక్షలు పొందవచ్చు. ఆ ప్రభుత్వ ప్రణాళిక ఏంటో తెలుసుకుందాం.

ఈ ప్లాన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన ఎల్ఐసీ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రభుత్వం తరపున ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ప్లాన్ చిన్న పెట్టుబడితో పెద్ద రాబడిని ఇస్తుందని గ్యారెంటీ ఇస్తోంది. ఈ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా మీరు మీ పిల్లల చదువులు, రుణాల చెల్లింపు. భవిష్యత్తు అవసరాలను తీర్చవచ్చు. దీనితో పాటు, బీమా రక్షణ, ఇతర పన్ను సంబంధిత ప్రయోజనాలు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎల్ఐసీ ప్రకారం, 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వారు మాత్రమే ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పాలసీ వ్యవధి గురించి చెప్పుకుంటే.. అది 12 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది.  ఇందులో కనీస హామీ మొత్తం పరిమితి రూ. 1, గరిష్టంగా ఎటువంటి పరిమితి లేదు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి ఈ ప్లాన్‌ను తీసుకుంటే.. అతను రోజుకు సుమారు రూ. 70 అంటే సంవత్సరానికి రూ. 26,534 పెట్టుబడి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా అతనికి రూ.10 లక్షల బీమా హామీ లభిస్తుంది. రెండో సంవత్సరంలో ఈ ప్రీమియం 25,962కి తగ్గుతుంది. ఈ విధంగా, మెచ్యూరిటీపై మీరు రూ. 48 లక్షలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు..

ప్లాన్ గురించి చదివిన తర్వాత మీరు కూడా ఈ ప్లాన్ తీసుకోవాలని అనుకుంటే మీ సమీపంలోని ఏదైనా LIC కార్యాలయానికి వెళ్లండి. ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు కొనుగోలు చేయవచ్చు. LIC కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీరు దీని గురించి మరింత వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం