
1. ప్రొఫైల్ అప్‌డేట్ చేయడం చాలా సులభం.. EPFO ఇప్పుడు ప్రొఫైల్ అప్‌డేట్ ప్రక్రియను గతంలో కంటే సులభతరం చేసింది. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధార్‌తో లింక్ చేసి ఉన్నట్లయితే మీరు మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలు లేకుండా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే 2017 అక్టోబర్ 1కి ముందు పీఎఫ్ ఖాతా తెరిచిన సభ్యులు కొన్ని సందర్భాల్లో వారి యజమాని ఆమోదం పొందవలసి ఉంటుంది.

2. ఉద్యోగాలు మారేటప్పుడు PF బదిలీ ఈజీ.. గతంలో ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం చాలా సుదీర్ఘమైన, కొన్నిసార్లు సమస్యాత్మకమైన ప్రక్రియ. యజమాని ఆమోదం లేకుండా, పని చేయలేం. కానీ ఇప్పుడు, జనవరి 15, 2025 నుండి ఈ ప్రక్రియ చాలా సులభతరం అయింది. ఇప్పుడు చాలా సందర్భాలలో PF బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీనివల్ల PF డబ్బు కొత్త ఖాతాకు వేగంగా, సులభంగా బదిలీ అవుతుంది.

3. డిటిజలైజేషన్.. జనవరి 16, 2025 నుండి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. EPFO జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియను డిజిటల్‌గా చేసింది. మీ UAN ఆధార్‌తో లింక్ చేయబడి ఉంటే లేదా ఆధార్ ఇప్పటికే ధృవీకరించబడి ఉంటే, మీరు జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. కానీ మీ UAN ఇంకా యాక్టివేట్ కాకుండా ఉంటే, ఆధార్ లింక్ లేకుంటే, సంబంధిత సభ్యుడు మరణించిన సందర్భాలలో మాత్రం ఫామ్ సమర్పించడం తప్పనిసరి.

EPFO 3.0 అమలుతో ఈపీఎఫ్‌వో కింద ఉన్న ఉద్యోగులు ఉపశమనం పొందవచ్చు. ఈ అప్‌గ్రేడ్ పీఎఫ్ ఉపసంహరణ, కేవైసీ అప్‌డేట్‌లు, క్లెయిమ్‌ల వంటి ప్రక్రియలను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడానికి ఏటీఎం లాంటి కార్డులను త్వరలో ఉపయోగించవచ్చు.

5. అధిక జీతంపై పెన్షన్ ప్రక్రియ పారదర్శకంగా మారింది.. అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం EPFO ఇప్పుడు మొత్తం ప్రక్రియను స్పష్టం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే, అతను అదనపు సహకారం చెల్లించడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. దీనితో పాటు, EPFO పరిధిలోకి రాని, వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. బకాయి ఉన్న విరాళాల చెల్లింపు, రికవరీ ఇప్పుడు వేరే విధంగా జరుగుతుంది, తద్వారా ప్రక్రియ మరింత పారదర్శకంగా, ట్రాక్ చేసేలా ఉంటుంది.