New Aadhaar App: త్వరలో కేంద్రం నుంచి కొత్త యాప్.. ఇక నుంచి ఇంటర్నెట్ లేకపోయినా..

కేంద్ర ప్రభుత్వం ఆధార్ సేవలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఆధార్ సేవలు పొందేలా కొత్త యాప్ తీసుకురానుంది. యాప్‌కు తుది మెరుగులు దిద్దుతుడండగా.. త్వరలో విడుదల చేయనుంది. గూగుల్ పే, ఐఓఎస్ వెర్షన్లలో యాప్ అందుబాటులోకి రానుంది.

New Aadhaar App: త్వరలో కేంద్రం నుంచి కొత్త యాప్.. ఇక నుంచి ఇంటర్నెట్ లేకపోయినా..
Aadhar Card

Updated on: Nov 26, 2025 | 3:46 PM

Aadhaar: దేశంలోని ప్రతీఒక్కరికీ అసవరమైన డాక్యుమెంట్ ఆధార్. ఏ సర్వీసు పొందాలన్నా సరే ఆధార్ కార్డు అనేది తప్పనిసనరి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆధార్‌ విషయంలో కొత్త మార్పులు తీసుకొస్తుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటం, డిజిటల్ ఇండియా లక్ష్యంగా ముందుకు వెళుతుండటంతో ప్రజలు సులువుగా ఆధార్‌ను ఉపయోగించుకునేలా నూతన మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కేంద్రం ఆధార్‌లో అనేక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో మార్పుకు నాంది పలికింది.

త్వరలో ఆధార్ కొత్త యాప్‌ను కేంద్రం తీసుకురానుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోయినా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వెరిఫికేషన్ కోసం ఆధార్ జిరాక్స్ ఇవ్వడం లేక ఆధార్ ఒరిజినల్ చూపించడం లాంటి ప్రక్రియలు ఉన్నాయి. ఇక ఒరిజినల్ ఆధార్ అందుబాటులో లేకపోతే ఆధార్ వెబ్ సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి డిజిటల్ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంటర్నెట్ అవసరం. కానీ కొత్తగా రానున్న యాప్‌ యూజ్ చేయడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ యాప్‌లో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ దగ్గర ఆధార్‌ను ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఆధార్‌లో మీరు ఎలాంటి సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నారు అనేది కూడా మీరు అనుమతి ఇవ్వొచ్చు. మీరు అనుమతి ఇచ్చిన డేటా మాత్రమే షేర్ అవుతుంది.

ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఇక ఆధార్ జిరాక్స్ ఇవ్వడం, ఒరిజినల్ చూపించడం లాంటివి అవసరం ఉండదు.మొబైల్ క్యూఆర్ కోడ్‌తోనే మీ ఆధార్ ధృవీకరణ పూర్తవుతుంది. ఏ సమాచారాన్ని పంచుకోవాలో మీరే నిర్ణయించుుకవోచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో మీ కుటుంబసభ్యుల ఆధార్ వివరాలను కూడా జోడించవచ్చు. దీని వల్ల కుటుంబసభ్యుల ఆధార్ వివరాలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇక మొబైల్ నెంబర్, అడ్రస్ మార్పు, బయోమెట్రిక్ లాక్ లేదా ఆన్ లాక్ వంటి సేవలు ఇందులో నుంచి పొందవచ్చు.