చవక… చవక.. BSNL నుంచి మరో సర్‌ప్రైజ్ రీచార్జ్ ప్లాన్.. ఎవరూ ఊహించి ఉండరు

ఇటీవల స్టూడెంట్ ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. తాజాగా మరో అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. మార్కెట్లోని ఇతర టెలికాం కంపెనీల ప్లాన్లతో పొలిస్తే ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ వివరాలు ఏంటి.?? అనేది ఇందులో చూద్దాం రండి.

చవక... చవక.. BSNL నుంచి మరో సర్‌ప్రైజ్ రీచార్జ్ ప్లాన్.. ఎవరూ ఊహించి ఉండరు
Bsnl Recharge Plan

Updated on: Nov 23, 2025 | 4:58 PM

BSNL Recharge plan: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల కస్టమర్లను పెంచుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు పోటీగా అనేక కొత్త ప్లాన్లను తీసుకొస్తుంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ ఉండే ప్లాన్లను తీసుకొస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా ఇటీవల 5జీ సర్వీసులను కూడా ప్రారంభించింది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీగా కస్టమర్లు పెరుగుతున్నారు. ప్రైవేట్ సంస్థల రీఛార్జ్ ధరలు ఎక్కువగా ఉండటంతో బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొబైల్ వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని చెప్పవచ్చు. ఇటీవల కేవలం రూ.251తో ఆన్‌లిమిటెడెట్ ప్లాన్ తీసుకురాగా. దీనికి మంచి ఆదరణ లభించింది. తాజాగా అదే బాటలో మరో చవకైన రీఛార్జ్ ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.

72 రోజుల స్టార్ట్ సేవింగ్స్ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ప్రవేశపెట్టింది. ఆ ప్లాన్‌తో ఒక్కసారి రీచార్జ్ చేస్తే 72 రోజలు పాటు డేటా, కాల్స్, ఎస్‌ఎంస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.485గా నిర్ణయించారు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 72 రోజుల పాటు అందిస్తుంది. అంటే రోజుకు రూ.6.74 పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇతర టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది.

బీఎస్‌ఎన్‌ఎల్ చవకైన ప్లాన్స్ అందిస్తున్నా.. మార్కెటింగ్ సరిగ్గా చేసుకోకపోవడం, పలుచోట్ల నెట్‌వర్కింగ్ సమస్య వల్ల కస్టమర్లు తగ్గుతున్నారు. నెట్‌వర్క్ సమస్య పరిష్కారం అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌కు కస్టమర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. బీఎస్‌ఎన్‌ల కొన్ని నెలల క్రితం 5 జీ సర్వీసులను ప్రారంభించింది. అప్పటినుంచి మార్కెట్లో మరింత దూకుడు పెంచింది.