AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంక్ అకౌంట్ మూసివేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు..

పాత బ్యాంక్ అకౌంట్ మూసివేయాలనుకుంటున్నారా..? అయితే తోందరపడి మూసివేకుండా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముందు ఈ విషయాలు తెలుసుకుని ఆ తర్వాత మూసివేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. కొంతమంది ఏమీ తెలుసుకోకుండా వెంటనే మూసివేయడం వల్ల నష్టం కలుగుతుంది.

Bank Account: బ్యాంక్ అకౌంట్ మూసివేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు..
Bank Accounts
Venkatrao Lella
|

Updated on: Dec 12, 2025 | 7:29 PM

Share

డిజిటల్ లావాదేవీలు చేసుకునే సౌకర్యం రావడం, ప్రభుత్వ పథకాల నగదు నేరుగా అకౌంట్లలో జమ చేస్తున్న ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్ అనేది అందరికీ అవసరమే. దీంతో చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉపయోగిస్తున్నారు. వేర్వురు అవససరాల కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నారు. అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లిమిట్, ఎక్కువ సంవత్సరాలు ట్రాన్సక్షన్లు ఎలాంటివి జరగకపోతే అకౌంట్‌ను ఇనాక్టివ్ చేస్తున్న క్రమంలో బ్యాంకు అకౌంట్లను చాలామంది మూసివేస్తున్నారు. క్లోజింగ్ ఫారంను ఫిల్ చేసి బ్యాంక్ అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అకౌంట్‌ను మూసివేసే సమయంలో మీరు చేసే కొన్ని పనులు మీకు నష్టం కలిగించవచ్చు.

మైనస్ బ్యాలెన్స్

అకౌంట్ వాడకపోతే మినిమం బ్యాలెన్స్ ఫైన్లు పడవని చాలామంది అనుకుంటారు. కానీ మీ నుంచి బ్యాంకులు ఏటీఎం, ఎస్ఎంఎస్, పాస్‌బుక్, సేవా ఛార్జీలు ప్రతీ ఏడాది వసూలు చేస్తాయి. జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటి ఛార్జీలన్నీ మైనస్ రూపంలో పడతాయి. అకౌంట్ మూసివేసే సమయంలో వాటిని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటి బ్యాలెన్స్‌ను ముందుగానే చెక్ చేసుకోండి.

డెబిట్ కార్డు ఛార్జీలు

మీరు డెబిట్ కార్డు వాడినా, వాడకపోయినా బ్యాంకులు ప్రతీ ఏడాది వార్షిక రుసుంలు వసూలు చేస్తాయి. ఇవి రూ.250 నుంచి రూ.700 వరకు ఉంటాయి. వీటిని మీరు బ్యాంక్ అకౌంట్ మూసివేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుంది.

ఆటోమేటిక్ పేమెంట్స్ తొలగించండి

ఇక మీ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్స్, కరెంట్ బిల్లు, లోన్ల ఈఎంఐలు, పాలసీ ప్రీమియంలు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంటే అకౌంట్ క్లోజ్ చేసేముందు వాటిని రద్దు చేసి వేరే బ్యాంక్‌కు లింక్ చేసుకోండి. ఒకవేళ మీరు పాత అకౌంట్‌కే ఉంచుకుంటే ఆటోమేటిక్ డెబిట్ ఫెయిల్ అయినప్పుడు బ్యాంకులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తాయి. దాని వల్ల మీరు నష్టపోతారు.

ఉచితంగా క్యాన్సిల్

కొన్ని బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లను ఒక ఏడాది తర్వాత ఎలాటి ఛార్జీలు చెల్లించకుండా మూసివేయవచ్చు. మరికొన్ని బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసిన 6 నుంచి 12 నెలల్లోపు మూసివేస్తే రూ.200 నుంచి రూ.500 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక మీరు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ పొందటానికి అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటే దానిని నిలిపివేసే ముందు దానిని చెక్ చేసుకోండి

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే