సంక్రాంతి సందడి మొదలైంది. పట్టణాల నుంచి స్వగ్రాాలకు పరుగులు పెడుతుంటారు. ఇందులో చాలా మంది రైల్వేలో ప్రయాణించేందుకు ఇష్టపడుతారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. అయితే ఇందు కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు తన పద్ధతులను మారుస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో రైల్వేలు ఆధునీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో, వందే భారత్, సెమీ-హై స్పీడ్ రైలు కూడా దేశంలో మొదలయ్యాయి. అనేక స్టేషన్ల ఆధునీకరణ కూడా జరుగుతోంది. ప్రయాణం సుఖవంతంగా ఉండేందుకు ఇప్పుడు ప్రయాణికులకు బెర్త్‌లను మార్చుకునే సౌకర్యాన్ని కూడా రైల్వేశాఖ కల్పిస్తోంది. మీ బెర్త్ మీకు నచ్చకపోతే, మీరు దానిని మధ్యలో అప్‌గ్రేడ్ చేయవచ్చు. మీరు స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారనుకోండి, అప్పుడు రైల్వే సౌకర్యం ద్వారా ప్రయాణంలోనే మీ సీటును ఏసీ కోచ్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఏ విండోకు వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ విధంగా, ప్రయాణీకులు అదనపు ప్రయాణం చేయవచ్చు.ఈ సేవను ప్రారంభించడం వెనుక రైల్వే ఉద్దేశ్యం ప్రయాణీకులకు సౌకర్యాన్ని అందించడం. వారి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలను తీర్చడం. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనలను సులభతరం చేసింది. దీంతో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా ప్రయాణికులు తమ కోచ్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, ప్రయాణికులు కొంత అదనపు చెల్లింపు చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.
మీరు ప్రయాణ సమయంలో మీ కోచ్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. దీని కోసం మీరు ఏ బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు మీ సీటుపై కూర్చున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఏం చేయాలో తెలుసుకుందాం. మీ సీటు స్లీపర్ కోచ్‌లో ఉండి.. ఇందుకు బదులుగా మీరు AC కోచ్‌లో ప్రయాణించాలనుకుంటే.. మీరు కోచ్‌లో ఉన్న TTEని సంప్రదించండి. మీ అభ్యర్థనను టీటీఈకి వివరించి చెప్పండి. ఏసీ కోచ్‌లో సీటు ఖాళీగా ఉంటే.. ఆ బెర్త్‌ను టీటీఈ మీకు కేటాయిస్తారు.
సీటును అప్‌గ్రేడ్ చేయడానికి బదులుగా.. మీరు నిబంధనల ప్రకారం TTEకి సూచించిన నగదును చెల్లించాలి. మరొక కోచ్‌లో బెర్త్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు రైల్వే ఈ సీట్ అప్‌గ్రేడ్ సిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ కోచ్‌లో సీటు ఖాళీ లేకుంటే.. మీకు బెర్త్ కేటాయించిన అదే కోచ్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం