గుడ్ న్యూస్ చెప్పిన పేటీఎం…

డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించుకుంటోంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా… పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించింది. ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రీచార్జెస్‌, బిల్‌ పేమెంట్లు, ఇంటర్నెట్‌ యాప్స్‌ ద్వారా చెల్లించే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌తోపాటు కిరాణా స్టోర్స్‌కు పోస్ట్‌పెయిడ్‌ పరిమితిని పెంచింది. అలాగే, పేటీఎం లైట్‌, డిలైట్‌, ఎలైట్‌ పేరుతో హామీలేని రుణాలు ఇవ్వనుంది. […]

గుడ్ న్యూస్ చెప్పిన పేటీఎం...

Updated on: Jun 09, 2020 | 9:28 PM

డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించుకుంటోంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా… పోస్ట్‌పెయిడ్‌ సేవలను విస్తరించింది. ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రీచార్జెస్‌, బిల్‌ పేమెంట్లు, ఇంటర్నెట్‌ యాప్స్‌ ద్వారా చెల్లించే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌తోపాటు కిరాణా స్టోర్స్‌కు పోస్ట్‌పెయిడ్‌ పరిమితిని పెంచింది. అలాగే, పేటీఎం లైట్‌, డిలైట్‌, ఎలైట్‌ పేరుతో హామీలేని రుణాలు ఇవ్వనుంది. వివిధ బ్యాంకేతర సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం ఈ ఫైనాన్సింగ్ సేవలను అందించనుంది. అలాగే, ఫర్నీచర్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువులు కొనేందుకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వనుంది. వీటికి ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని ఆ పేటీఎం వెల్లడించింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్నవారికి పేటీఎం ఇస్తున్న రుణ సహాయం పెద్ద ఉపశమనంగా మారనుంది.