Credit Card Payments: గడువు ముగిసినా చెల్లింపులు షురూ.. ఆ రెండు యాప్స్‌లో కొనసాగుతున్న బిల్లు చెల్లింపులు

|

Jul 03, 2024 | 7:45 PM

భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్)పై ఆర్‌బీఐ ఇచ్చిన గడువు జూన్ 30తో ముగిసినా వినియోగదారులు ఇప్పటికీ క్రెడ్, ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను చేయగలుగుతున్నారు. ఐఎంపీఎస్, నెఫ్ట్, యూపీఐ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించి నాన్-కంప్లైంట్ బ్యాంక్‌లకు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. అయితే మాత్రం ఈ తరహా చెల్లింపులకు మద్దతు ఇవ్వడం లేదు.

Credit Card Payments: గడువు ముగిసినా చెల్లింపులు షురూ.. ఆ రెండు యాప్స్‌లో కొనసాగుతున్న బిల్లు చెల్లింపులు
భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. నేడు దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో దేశంలో పండుగలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దసరా, దీపావళి, ఛత్ వంటి అనేక పండుగలు రాబోయే కొద్ది రోజుల్లో జరుపుకోనున్నాయి. పండుగల సమయంలో ప్రజలు చాలా షాపింగ్ చేస్తారు. దీని కోసం చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి షాపింగ్‌ చేస్తుంటారు.
Follow us on

భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్)పై ఆర్‌బీఐ ఇచ్చిన గడువు జూన్ 30తో ముగిసినా వినియోగదారులు ఇప్పటికీ క్రెడ్, ఫోన్‌పే వంటి థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను చేయగలుగుతున్నారు. ఐఎంపీఎస్, నెఫ్ట్, యూపీఐ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించి నాన్-కంప్లైంట్ బ్యాంక్‌లకు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. అయితే మాత్రం ఈ తరహా చెల్లింపులకు మద్దతు ఇవ్వడం లేదు. జూన్ 30 తర్వాత అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా తప్పనిసరిగా ప్రాసెస్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఆదేశించింది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ వంటి నాన్-కంప్లైంట్ బ్యాంక్‌ల కోసం చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి క్రెడ్, ఫోన్‌పే యాప్‌లు ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి బీబీపీఎస్ యాక్టివేట్ చేసిన బ్యాంకుల కోసం కేంద్రీకృత బిల్లింగ్ నెట్‌వర్క్ ద్వారా చెల్లింపులను రూట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్‌పే, క్రెడ్‌లో క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జూన్ 30 తర్వాత క్రెడ్ వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్‌లు చెల్లింపులు చేయలేరనే వార్తలు వినియోగదారులు ఆందోళనకు గురి చేశాయి. అయితే ఆయా యాప్స్ యూజర్లకు ఇప్పటికీ ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు చేస్తున్నారు. అయితే బీబీపీఎస్ ఆదేశాన్ని పాటించని రుణదాతల కోసం థర్డ్ పార్టీ యాప్‌లు ఐఎంపీఎస్, నెఫ్ట్, యూపీఐ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. పేటీఎం మాత్రం జూలై 1, 2024 నుంచి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో రిజిస్టర్ అయిన బ్యాంకులకు మాత్రమే మేము క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను సపోర్ట్ చేస్తాము. ఈ బ్యాంక్‌కు మద్దతు లభించిన తర్వాత మేము మీకు అప్‌డేట్ చేస్తామని జూలై 1న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారుడికి పేటీఎంలో పాప్ అప్ అయ్యింది. 

అయితే ఒక వినియోగదారు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ బిల్లును క్రెడ్ ద్వారా చెల్లించారు. రుణదాత ఇంకా బీబీపీఎస్ యాక్టివేట్ చేయనందున చెల్లింపు ఐఎంపీఎస్ ద్వారా మళ్లించారు. అయితే అదే క్రెడ్ ద్వారా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారు చేసిన మరొక చెల్లింపు చేయగా బీబీపీఎస్ ద్వారా చెల్లింపును స్వీకరించామని మెసేజ్ వచ్చింది. చెల్లింపు ట్రెండ్‌లపై మెరుగైన కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ ద్వారా మోసపూరిత లావాదేవీలను ట్రాక్ చేసే, పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుని తాజా నిబంధన తీసుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి