ఉద్యోగం బోర్ కొట్టిందా.? వచ్చే సంపాదన సరిపోవట్లేదా.? ఇంకెందుకు ఆలస్యం.. మీ దగ్గర మాంచి బిజినెస్ ఐడియా.. అలాగే మార్కెటింగ్ బ్రెయిన్ ఉన్నట్లయితే..! లేట్ ఎందుకు ఓ వ్యాపారం స్టార్ట్ చేసేయొచ్చు. నిత్యం జీవితంలో మనకు అవసరమయ్యే అవసరాలను.. ఆదాయవనరుగా మార్చుకోవచ్చు. అందులో ఒకటి పేపర్ ప్లేట్ల బిజినెస్. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకైనా, రిసెప్షన్‌కైనా, బర్త్‌డేకైనా, మరేదైనా ఫంక్షన్ అయినా సరే.. బఫే సిస్టంలోనే విందు ఉంటుంది. ఇక ఈ బఫే భోజనాలకు పేపర్ ప్లేట్ల అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. కేవలం శుభకార్యాలకు మాత్రమే కాదు.. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు కూడా ఈ పేపర్ ప్లేట్లను వినియోగించుకోవచ్చు.
ఈ వ్యాపారం కోసం పెద్ద స్థలం ఏం అక్కర్లేదు. మీ ఇంటి ముందు చిన్న షట్టర్ ఉంటే చాలు. ఈ పేపర్ ప్లేట్ల తయారీ మిషన్లను పెట్టుకోవచ్చు. వీటి ప్రారంభ ధర సుమారు రూ. 60 వేలు ఉంటుంది. ఇంకొంచెం హై-ఎండ్ మిషన్ కావాలంటే.. రూ. 90 వేల వరకుఉండొచ్చునని అంచనా. ఇక పేపర్ ప్లేట్లకు సంబంధించిన ముడిసరుకు కొనుగోలుకు సుమారు రూ. 50 నుంచి 70 వేలు అవుతుంది. ఈ మిషన్ ద్వారా రోజుకు 8 వేల బఫే ప్లేట్లు తయారీ చేయవచ్చు. ఇక హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్కో ప్లేట్ 20 పైసల ధర పలుకుతుంది. అనగా.. రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చులు పోనూ రోజుకు రూ. 800 నుంచి రూ. 1400 వరకు మిగులుతుంది. ఇలా నెలకు రూ. 30 నుంచి 45 వేల వరకు సంపాదించవచ్చు. కాగా, ప్లేట్ల తయారీ ఒక ఎత్తైతే.. వాటిని అమ్మడం మరో ఎత్తు. మార్కెటింగ్ స్కిల్స్‌పై అవగాహన ఉంటే నెలకు వేలల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. అలాగే ఈ పేపర్ ప్లేట్లతో వచ్చే స్క్రాప్‌ను కూడా కేజీకి రూ. 2 నుంచి రూ. 5 వరకు విక్రయించవచ్చు. అలా కూడా లాభాలు వస్తాయి. మరి లేట్ ఎందుకు ఓసారి మీరూ ఈ బిజినెస్ ఐడియా ట్రై చేయండి.