AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి.. మారిన నిబంధనలు ఇవే..

పాన్ కార్డు ఉన్నవారికి కేంద్రం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి కొన్ని లావాదేవీలకు పాన్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. లేకపోతే మీ లావాదేవీలు ప్రాసెస్ చేయరు. ఇక తప్పుడు పాన్ వివరాలు అందిస్తే భారీగా జరిమానా విధించే అవకాశముంది.

Pan Card: పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్.. ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి.. మారిన నిబంధనలు ఇవే..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Jun 13, 2026 | 9:55 PM

Share

భారతదేశంలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించేందుకు పాన్ కార్డు తప్పనిసరి. ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డు అందించాల్సి ఉంటుంది. ఇది లేకపోతే పెద్ద మొత్తంలో ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. అందుకే పాన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఉద్యోగంలో చేరాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇక్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, బ్యాంకులో రూ.లక్ష పైబడి డిపాజిట్ లేదా విత్ డ్రా చేయాలన్నా పాన్ అవసరం. ఇక పెద్ద మొత్తం ఖర్చు చేసి ఆస్తి కొనాలన్నా దీని అవసరం ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నా పాన్ కార్డు ఉపయోగపడుతుంది.

ఈ లావాదావీలకు పాన్ తప్పనిసరి

మీ పాన్ కార్డు ఆధారంగా ఐటీ శాఖ మీపై నిఘా ఉంచుతుంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ పాన్ నిబంధనల్లో మార్పులు చేసింది. కొన్ని లావాదేవీలకు దీనిని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.20 లక్షలపైబడి ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు పాన్ తప్పనిసరిగా అందించాలి. ఇక రూ.2 లక్షలకుపైబడి విలువైన ఆస్తులు లేదా సేవలను కొనుగోలు చేసేందుకు పాన్ తప్పనిసరి చేశారు. అలాగే రూ.లక్ష కంటే ఎక్కువ విలువైన షేర్ల అమ్మకం, కొనుగోలుకు పాన్ అందించాలి. అలాగే రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన కారు లేదా బైక్ కొనుగోలుకు పాన్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఇక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా అవసరం.

పాన్ అందించకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి..?

కొన్ని లావాదేవీలకు పాన్ అందించడం తప్పనిసరి. అయితే అందించనప్పుడు సదరు లావాదేవీలను ప్రాసెస్ చేయరు. పాన్ ఉపయోగించి లావాదేవీలు చేసినప్పుడు టీడీఎస్, టీసీఎస్, ఆర్థిక లావాదేవీల నివేదిక (SFT), వార్షిక సమాచార నివేదిక (AIS) వంటి ప్లాట్‌ఫారమ్‌లలో నమోదు చేయవచ్చు.వ్యక్తి ప్రకటించిన ఆదాయానికి, వారి ప్రధాన ఆర్థిక లావాదేవీలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఐటీ శాఖ నోటీసులు పంపి వివరణ కోరే అవకాశం ఉంటుంది. ఇక తప్పుడు పాన్ కార్డు వివరాలు లేదా నకిలీ పాన్ కార్డు అందిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తారు. ఇక ఇన్‌కమ్ ట్యాక్ డిపార్ట్‌మెంట్ నుంచి అదనపు పరిశీలన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక పన్ను క్రెడిట్‌లను పొందడంలో ఇబ్బందులు, రికార్డులలో వ్యత్యాసాలు వంటి ఇబ్బందులు రావొచ్చు. ఐటీ శాఖ డేటా అనలిటిక్స్ ఆధారంగా పాన్ లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. పాన్ ద్వారా చేసే లావాదేవీలు, మీరు పొందే ఆదాయం మధ్య తేడా ఉంటే వెంటనే గుర్తు పడుతుంది.

Follow Us
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..
నల్ల మట్టితో చేసే ఇటుకలకు ఎర్ర రంగు ఎలా వస్తుంది?
నల్ల మట్టితో చేసే ఇటుకలకు ఎర్ర రంగు ఎలా వస్తుంది?
ఆ ఒక్క తప్పే శాపమైందా.. గెలిచే మ్యాచ్‌ని ముంచేసిన గంభీర్..!
ఆ ఒక్క తప్పే శాపమైందా.. గెలిచే మ్యాచ్‌ని ముంచేసిన గంభీర్..!
శుక్ర కటాక్షం..ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం, ఆర్థిక పురోగతి!
శుక్ర కటాక్షం..ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం, ఆర్థిక పురోగతి!
పని చేయకున్నా ప్రతి నెలా 9250 గ్యారెంటీ ఆదాయం.. కేంద్రం తెచ్చిన..
పని చేయకున్నా ప్రతి నెలా 9250 గ్యారెంటీ ఆదాయం.. కేంద్రం తెచ్చిన..
పసిడి ప్రియులకు శుభవార్త.. పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కారణాలు
పసిడి ప్రియులకు శుభవార్త.. పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కారణాలు
మానవత్వం చాటిన యువతి ఆత్మీయ బంధం..!
మానవత్వం చాటిన యువతి ఆత్మీయ బంధం..!
వేడివేడి ఖిచ్డీ.. హైదరాబాద్ స్టైల్ లో ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
వేడివేడి ఖిచ్డీ.. హైదరాబాద్ స్టైల్ లో ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది