Pakistan Crisis: పాకిస్థాన్‌కు శ్రీలంక పరిస్థితులు.. తీవ్రమైన పవర్ కట్స్.. అలుముకుంటున్న చీకట్లు..

|

Jun 15, 2022 | 4:45 PM

Pakistan: రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి సాగిన యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి కారణంగా, రష్యా నుంచి గ్యాస్ కొనుగోలును యూరప్ నిరంతరం తగ్గించింది. దీంతో అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ ధరలు ఆకాశాన్ని తాకాయి.

Pakistan Crisis: పాకిస్థాన్‌కు శ్రీలంక పరిస్థితులు.. తీవ్రమైన పవర్ కట్స్..  అలుముకుంటున్న చీకట్లు..
Pakistan
Follow us on

Pakistan: రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి సాగిన యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడి కారణంగా, రష్యా నుంచి గ్యాస్ కొనుగోలును యూరప్ నిరంతరం తగ్గించింది. దీంతో అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్.. ఇప్పుడు అనేక నగరాల్లో రోజూ 12 గంటల కంటే ఎక్కువ విద్యుత్ కోతలను విధిస్తోంది. గడచిన రెండు సంవత్సరాల్లో ఎల్‌ఎన్‌జీ రేట్లు దాదాపు 1000 శాతం మేర పెరిగాయి.

సుమారు దశాబ్దం క్రితం.. పాకిస్థాన్ ఇంధనానికి సంబంధించి కొత్త దీర్ఘకాలిక విధానాన్ని అనుసరించింది. ఎల్‌ఎన్‌జీపై భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇటలీ మరియు ఖతార్‌లోని కంపెనీలకు ఎల్‌ఎన్‌జీ సరఫరా చేయడానికి దీర్ఘకాలిక ఒప్పందాలు ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జీ ధరలు పెరిగినందున.. ఈ కంపెనీలు పాకిస్థాన్‌కు లభించే ఎల్‌ఎన్‌జీని ఇతర చోట్ల వినియోగించడం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నాయి. మరోవైపు.. పవర్ ప్లాంట్ల నుంచి ఎరువుల కర్మాగారం వరకు ఎల్‌ఎన్‌జీ కొరతను ఎదుర్కొంటున్నాయి.

గత నెల ఈద్ సందర్భంగా విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి, స్పాట్ మార్కెట్ నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లను కేవలం ఎల్‌ఎన్‌జీ షిప్‌మెంట్‌ కొనుగోలు చేసేందుకు వినియోగించింది. ఈ క్రమంలో పాక్ వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు కనిష్ఠాలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో అక్కడి పవర్ ప్లాంట్లు ఎల్‌ఎన్‌జీ కొరతతో నిలిచిపోయాయి. ఈ కారణంగా దేశంలో రోజూ సుమారు 12 గంటల పాటు పవర్ కట్స్ సర్వసాధారణంగా మారాయి. వేడి గాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో కరెంటు కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

కరెంటు పొదుపు కోసం పాకిస్థాన్ ఇటీవలి కాలంలో కొన్ని దూకుడు చర్యలు తీసుకుంది. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులను శనివారం షిప్టు నుంచి డిశ్చార్జి చేసింది. భద్రతా సిబ్బందికి బడ్జెట్ కూడా 50 శాతం మేర తగ్గించింది. వివాహ వేడుకలను కూడా నిషేధించింది. ఎరువుల కర్మాగారానికి ఎల్‌ఎన్‌జి సరఫరాను నిలిపివేయడం ద్వారా విద్యుత్ ప్లాంట్‌కు మరింత సరఫరా జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కూడా కరెంట్ లేక మూగబోయాయి. కరెంటు లేకపోవడంతో టవర్లు పనిచేయక, జనరేటర్లు నడపడానికి ఆయిల్‌ లేకపోవడంతో ఆపరేటర్లు అవస్థలు పడుతున్నారు.

2017లో పాకిస్థాన్ తదుపరి దశాబ్దానికి ఎల్‌ఎన్‌జీని సరఫరా చేయడానికి ఇటాలియన్ కంపెనీ ఎనిస్పా, ట్రేడింగ్ హౌస్ గన్‌వోర్ గ్రూప్ లిమిటెడ్‌కు టెండర్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు అక్టోబర్ 2021 – జూన్ 2022 మధ్య పాకిస్థాన్ కు డజన్ల కొద్దీ సరుకుల పంపిణీని కోల్పోయాయి. పాకిస్థాన్‌కు డెలివరీ చేయడానికి తమ వద్ద ఎల్‌ఎన్‌జీ లేదని రెండు కంపెనీలు చెబుతున్నాయి. ఇది నిజం కానప్పటికీ.. రెండు కంపెనీలు యూరప్ కు ఎల్‌ఎన్‌జీని సరఫరా కొనసాగిస్తూనే ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.