ఆర్డర్ చేయడానే భోజనాన్ని ఇంటికి తీసుకువచ్చి అందించే జొమాటో గురించి తెలియని వారెవ్వరూ ఉండవు. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, చిన్న పట్ణణాలు, మేజర్ పంచాయతీలలో కూడా ఈ సంస్థ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మనకు కావాల్సిన భోజనాన్ని ఆర్డర్ చేయడానే ఈ సంస్థకు సంబంధించిన డెలివరీ సిబ్బంది తమకు ఇంటికి తీసుకువచ్చి, సమయానికి భోజనం అందజేస్తారు. దీంతో అనేక మంది జొమాటో సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ సంస్థ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి అభిమానాన్ని పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డర్ షెడ్యూలింగ్ అనే కొత్త ఫీచర్ ను ప్రారంభించారు. దీని ద్వారా రెండు రోజుల ముందుగానే భోజనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
ప్రముఖ ఫుడ్ డెలివర్ ఫ్లాట్ ఫాం అయిన జోమాటా తీసుకువచ్చిన కొత్త ఫీచర్ తో వినియోగదారులకు మరిన్ని మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని అనేక నగరాల్లో జోమాటో సేవలు అందిస్తోంది. కొత్త ఫీచర్ కారణంగా ఆయా నగరాల్లోని కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే రెండు రోజుల ముందుగానే ఆర్ధర్ ఇవ్వడం వల్ల సమాయానికి ఆహారం అందించే అవకాశం ఉంటుంది.
జొమాటో సీఈవో, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ కొత్త ఫీచర్ గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీ ఎన్ సీఆర్, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, జైపూర్ నగరాల్లో కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడున్న 13 వేల రెస్టారెంట్ల నుంచి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే రూ.వెయ్యి కంటే ఎక్కువ ఆర్డర్ల కోస షెడ్యూలింగ్ అందుబాటులో ఉంది. ఆర్డర్ షెడ్యూలింగ్ ఫీచర్ ను ప్రణాళికా బద్ధంగా విస్తరించనున్నట్టు దీపిందర్ గొయిల్ తెలిపారు. తక్కువ మొత్తం కలిగిన ఆర్డర్ కు కూడా ఇవి వర్తింపజేస్తామని వివరించారు. భవిష్యత్తులో మిగిలిన నగరాలతో పాటు రెస్టారెంట్ల సంఖ్యను కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
ఏడు నగరాలలోని మంచి రెస్టారెంట్లను ఎంపిక చేసి కొత్త ఫీచర్ ను జొమాటో అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిలో అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. తయారీలో నిబంధనలను పక్కగా పాటిస్తున్నారు. రుచికి, శుభ్రతగా అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జొమాటో సర్వీస్ ఆఫర్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకువచ్చింది. దానిలో భాగంగా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీ ఇటీవల తన ఇంటర్‌సిటీ డెలివరీ సేవను ఆపేసింది. చిన్న పార్సిల్ సర్వీసుల కోసం గతేడాది అక్టోబర్ లో దాన్ని ప్రారంభించింది. జొమాటో కంపెనీ ఈ నెల ప్రారంభంలో కొత్త గ్రూప్ ఆర్డరింగ్ ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది గ్రూప్‌ల కోసం ఆహారాన్ని ఆర్డర్ చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి దాన్ని రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి