Online Transactions: క‌రోనా కార‌ణంగా పెరిగిన డిజిట‌ల్ లావాదేవీలు.. పాత నోట్ల ర‌ద్దు స‌మ‌యం కంటే..

|

May 04, 2021 | 6:23 AM

Online Transactions: పాత నోట్ల ర‌ద్దు అనంత‌రం భార‌త్‌లో డిజిటల్ పేమెంట్‌లు బాగా పెరిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా డిజిట‌ల్ పేమెంట్ సంస్థ‌లు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున డిజిటల్..

Online Transactions: క‌రోనా కార‌ణంగా పెరిగిన డిజిట‌ల్ లావాదేవీలు.. పాత నోట్ల ర‌ద్దు స‌మ‌యం కంటే..
Upi
Follow us on

Online Transactions: పాత నోట్ల ర‌ద్దు అనంత‌రం భార‌త్‌లో డిజిటల్ పేమెంట్‌లు బాగా పెరిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా డిజిట‌ల్ పేమెంట్ సంస్థ‌లు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపుల‌కు మొగ్గ‌చూపారు. ఇక ప్ర‌భుత్వం కూడా ఆన్‌లైన్ ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించిన విష‌యం కూడా విదిత‌మే. అయితే పాత నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో జ‌రిగిన ఆన్‌లైన్ పేమెంట్స్‌తో పోలిస్తే.. ప్ర‌స్తుతం కోవిడ్ స‌మ‌యంలోనే డిజిట‌ల్ పేమెంట్స్ ఎక్కువ‌గా పెరిగిన‌ట్లు తాజా గ‌ణంకాలు చెబుతున్నాయి.
గ‌తంతో పోలిస్తే.. క‌రోన స‌మ‌యంలో దేశవ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌తో పాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్‌ కోడ్‌లను అనుమతిస్తుండటంతో రిటైల్‌ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్‌ నివేదికలో పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావ‌డంతో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులు విస్తరిస్తున్నాయని నాబార్డ్ వివ‌రించింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఆన్‌లైన్ చెల్లింపులు బాగా పెరిగాయని తేలింది. నాబార్డ్ అందించిన నివేదిక ప్ర‌కారం.. 2019 డిసెంబర్‌లో జరిగిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే 2020 అక్టోబర్‌లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి.

Also Read: Corona Alert: క‌రోనా భ‌యంతో ప‌దే ప‌దే సిటీస్కాన్ చేసుకుంటున్నారా.? వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.. జాగ్ర‌త్తా.!

Lock down: లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతోన్న‌ మెజారిటీ ప్ర‌జ‌లు.. ఆన్‌లైన్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు..

WhatApp New Feature: ఇక‌పై వాయిస్ మెసేజ్‌ల‌లో పొర‌పాటు జ‌ర‌గ‌దు.. కొత్త ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ వాట్సాప్‌..