ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఓలా సంస్థ.. రిపబ్లిక్ డే సందర్భంగా భారీ డిస్కౌంట్ సేల్ ను నిర్వహిస్తోంది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 15,000 డిస్కౌంట్ పై అందిస్తోంది. ఈ ఆఫర్ జనవరి 26 నుంచి ప్రారంభమై జనవరి 29 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ఆఫర్ ను ప్రకటించింది. ” భారతదేశంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కి మారడానికి ఒక కారణం అవసరమా? ఈ రిపబ్లిక్ డే సందర్భంగా, మేము మీకు చాలా ఇస్తున్నాం ! నమ్మశక్యం కానీ ఆఫర్లు, మరెన్నింటినో ఆస్వాదించండి ” అని కంపెనీ ట్వీట్ చేసింది.
ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటరఱ్ కొనుగోలుపై రూ. 15,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశాన్ని కంపెనీ అందిస్తుంది. ఈ స్కూటర్ ను కొనుగోలు చేసే వారికి రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు రూ. 5,000 అదనపు డిస్కౌంట్ ను కూడా కంపెనీ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఖాకీ కలర్ వేరియంట్ పై మాత్రమే అందుబాటులో ఉండనుంది. అలాగే వినియోగదారులు ఓలా అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో అదనంగా రూ .10,000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.
Needed a reason to switch to India’s #1 EV? This Republic Day, we’re giving you many! Enjoy incredible offers and so much more. pic.twitter.com/v7k0F61eSk
— Ola Electric (@OlaElectric) January 25, 2023
ఓలా ఎలక్ట్రిక్ 2021 లో ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇది కంపెనీ లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ .1.40 లక్షలుగా ఉంది. పింగాణీ వైట్, ఖాకీ, నియో మింట్, కోరల్ గ్లామర్, జెట్ బ్లాక్, మార్ష్ మెలో, లిక్విడ్ సిల్వర్, మిలీనియల్ పింక్, ఆంత్రాసైట్ గ్రే, మిడ్ నైట్ బ్లూ, మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఫుల్ ఛార్జ్ తో సుమారు 170 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్, హైపర్ అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ లాంచింగ్ అప్పుడు ప్రకటించింది.
ఇటీవల కంపెనీ ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ ని అప్ గ్రేడ్ చేసి మూవ్ఓఎస్ 3 పేరుతో విడుదల చేసింది. హిల్ అసిస్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సరికొత్త ఫీచర్లు ఈ మూవ్ఓఎస్ 3 లో అందుబాటులో ఉన్నాయి. సరికొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్ తో అందుబాటులోకి వచ్చిన కీలక ఫీచర్లలో హైపర్ ఛార్జింగ్ ఒకటి. ఇది కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ తో 50 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ప్రాక్సిమిటీ అన్ లాక్, పార్టీ మోడ్ వంటి వివిధ రకాల ఫీచర్లు కూడా ఈ మూవ్ఓఎస్ 3 లో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..