Ola S1 Pro Gen 2: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభించిన ఓలా.. ధర ఎంతో తెలుసా.?
ఒలా ఎస్ ప్రో జెన్1 స్కూటర్‌కు కొనసాగింపుగా ఈ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఒలా ఎస్1ప్రో జెన్2 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మరెన్నో అత్యాధునిక ఫీచర్లను తీసుకొచ్చారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 100కిపైగా నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. వినియోగదారులు షోరూమ్స్ నుంచి లేదా ఓలా యాప్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయొచ్చని కంపెనీ చెబుతోంది...
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో దూసుకుపోతున్న ఓలా తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఒలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్ 2 పేరుతో ఓలా ఇటీవల ఈ స్కూటర్లను లాంచ్ చేసింది. అయితే తాజాగా శనివారం నుంచి వీటి డెలివరీలను ప్రారంభించింది ఓలా.
ఒలా ఎస్ ప్రో జెన్1 స్కూటర్‌కు కొనసాగింపుగా ఈ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఒలా ఎస్1ప్రో జెన్2 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మరెన్నో అత్యాధునిక ఫీచర్లను తీసుకొచ్చారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 100కిపైగా నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. వినియోగదారులు షోరూమ్స్ నుంచి లేదా ఓలా యాప్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయొచ్చని కంపెనీ చెబుతోంది.
ఓలా ఎస్ ప్రో జెన్2 స్కూటర్ డెలివరీలను ప్రారంభించడంపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ కొత్త స్కూటర్ డెలివరీలను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో వచ్చిన ఈ స్కూటర్ దేశంలో అత్యాధుని ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో ఒకటని, ఎస్ వన్ ప్రో జెన్ 1కు వచ్చిన ఆధారణతోనే ఈ కొత్త వెర్షన్ తీసుకొచ్చామని తెలిపార. ఎస్1 ప్రో జెన్ 2 అమ్మకాలు భారీగా ఉంటాయనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఓలా ఎస్1 ప్రో జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 195 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇక పేరుకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా పికప్ విషయంలో ఈ స్కూటర్ బాగుంది. కేవలం 2.6 సెకన్స్‌లో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ స్కూటర్ అందుకోగలదని ఓలా తెలిపింది.
ఇక ఈ స్కూటర్ వేగానికి కారణం బరువును తగ్గించడమే. పాత మోడల్‌తో పోల్చితే ఈ స్కూటర్ బరువు దాదాపు 6 కిలోలు తక్కువగా ఉంటుంది. 34-లీటర్ బూట్ స్పేస్, బలమైన గ్రాబ్ రైల్స్ ఈ స్కూటర్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ స్కూటర్‌లో 11కిలోవాట్స్ పీక్ పవర్‌తో శక్తివంతమైన మిడ్-డ్రైవ్ మోటర్‌ను అందించారు. అలాగే బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్, సస్పెన్షన్ ఈ స్కూటర్ సొంతం. జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, స్టెల్లార్, మిడ్‌నైట్ బ్లూ, అమెథిస్ట్ కలర్స్‌లో ఈ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఇక ధర విషయానికొస్తే ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,47,499గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..