
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు వాహనాల తయారీ కంపెనీలు కూడా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: దీపావళి సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ఎయిర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ S1 ధర రూ.84,999గా నిర్ణయించింది. అయితే అక్టోబరు 24 వరకు బుక్ చేసుకున్న వారికి కొన్ని రాయితీలు ఇవ్వనున్నారు. దీపావళి ఆఫర్ కింద బుక్ చేసుకున్న కస్టమర్లు రూ.79,999కే పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం మీరు దీన్ని కేవలం రూ. 999తో బుక్ చేసుకోవచ్చు. స్కూటర్ డెలివరీ కావాలంటే ఏప్రిల్ 2023 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఓలా ఈవెంట్‌లో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన పలు విశేషాలను తెలిపారు. ఈ స్కూటర్ 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని, ఇది కాకుండా, లాక్, అన్‌లాకింగ్ కోసం అధునాతన ఫీచర్లు ఈ కొత్త మోడల్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఓలా నుండి వచ్చిన ఈ కొత్త స్కూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ 3 (os3) తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు నడుస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు.
A scooter for everyday, a scooter for everyone. The most awaited Ola S1 Air is here at an introductory price of Rs. 79,999! Offer valid till 24th October only. Hurry! Reserve now for Rs. 999 ?? pic.twitter.com/KmV0DGRs3Z
— Ola Electric (@OlaElectric) October 22, 2022
అడ్వాన్స్ అన్‌లాకింగ్ సిస్టమ్ గురించి తెలుపుతూ రైడర్ వాహనం వద్దకు రాగానే వాహనం ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. అదే సమయంలో మీరు స్కూటర్ నుండి దూరంగా వెళ్ళిన వెంటనే అది లాక్ చేయబడుతుంది. ఇది కాకుండా దాని మ్యూజిక్ సిస్టమ్ కూడా అప్‌గ్రేడ్ చేయబడింది. భారత్‌లో కాకుండా పలు దేశాల్లో దీన్ని విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటర్ జనవరి 2023లో నేపాల్‌లో ఆపై లాటిన్ అమెరికాలో ప్రారంభించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఓలా కంపెనీకి చెందిన S1చ, S1 ప్రో మోడల్‌లలో 2 స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. S1 ధర రూ. 99,999, S1 ప్రో ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం S1 ఓలా నుండి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి