దేశంలోని ఆటో రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు తమదైన ముద్ర వేస్తున్నాయి. వాటిల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన శ్రేణిలో నంబర్ వన్ బ్రాండ్ గా ఓలా వెలుగొందుతోంది. ఇదే క్రమంలో ఓలా సీఈఓ నుంచి మరో న్యూస్ ఇప్పుడు క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఓలా నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నట్లు ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు. ఈ మేరకు ఓ టీజర్ ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టెస్ట్ రైడ్లు, డెలివరీలు ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభం కానున్నాయి.
ఓలా సీఈఓ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రత్యేక టీజర్ ను పోస్ట్ చేశారు. అందులో తమ మొదటి ఓలా ఎస్ 1 వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేశామని, చాలా బాగుందని, వినియోగదారులకు వద్దకు జూలై నుంచి వస్తుందని ట్వీట్ చేశారు. అంతేకాక ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ 1 స్కూటర్ కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోందని ప్రకటించారు. ఇదే తమ కంపెనీ నుంచి వస్తున్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వాహనమని భవిష్ పేర్కొన్నారు.
Test drove the first S1 Air vehicles!! Loving them ?
Coming to you in July ???? pic.twitter.com/wWnIAFYs62
— Bhavish Aggarwal (@bhash) May 23, 2023
ఈ ఓలా ఎస్1 ఎయిర్ వాహనం మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2kwh, 3kwh, 4kwh బ్యాటరీ సామర్థ్యాలతో ఉండే ఈ వాహనాల ధరలు రూ. 84,999,రూ, 99,999, 1,09,000 ఎక్స్ షోరూమ్ గా ఉన్నాయి. వీటిలో 4.5kw పవర్ విడుదల చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు ఉంటుంది. 2kwh బ్యాటరీ ఉండే వాహనం సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. అలాగే 3kwh బ్యాటరీ ఉండే స్కూటర్ 125 కిలోమీటర్లు, 4kwh బ్యాటరీ సామర్థ్యంతో ఉండే స్కూటర్ 165 కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై ఇస్తుంది.
ఓలా ఎస్ 1 ఎయిర్ డిజైన్ చాలా వరకూ ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లను పోలి ఉంటుంది. ఇవి ఐదు డ్యూయల్ టోన్ పెయింట్ థీమ్స్ తో ఉంటాయి. కోరల్ గ్లామ్, నియో మింట్, పోర్సలీన్ వైట్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..