Ola S1 Air Booking: ఓలా ఎస్1 ఎయిర్ బుకింగ్ విండో తెరుచుకోగానే ఒక్కసారిగా కస్టమర్ల నుంచి బుకింగ్స్ తుఫాను ఏర్పడింది. అరగంటలోనే ఈ-స్కూటర్ కోసం 1,000 యూనిట్ల వరకు బుక్ అయ్యాయని ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇంకా 3 గంటల తర్వాత దాదాపు 3 వేల యూనిట్లు బుక్ అయ్యాయని రిపోర్ట్ చెబుతున్నాయి. అంతకుముందు ఓలా ఎలక్ట్రిక్ తన S1 ఎయిర్ స్కూటర్ యూనిట్ కొనుగోలును కంపెనీ కమ్యూనిటీ సభ్యుల కోసం ఒక రోజు మాత్రమే ప్రారంభించింది. జూలై 27న భవిష్ అగర్వాల్ లైవ్ వెబ్‌కాస్ట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ విండో అధికారికంగా జూలై 28న ప్రారంభమవుతుందని ప్రకటించారు.
Ola S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ప్రో లాగా అదే ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది. ఇంకా ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ నుంచి అత్యంత చౌకైన స్కూటర్ ఇదే. అయితే కొన్ని ఫీచర్లను తగ్గించడం వల్ల ధర తగ్గించబడిందనే ప్రచారం ఉంది. ఇందులో చిన్న 3 kWh బ్యాటరీ ప్యాక్ ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 125 కి.మీల వరకు ప్రయాణించగలదు. S1 ఎయిర్‌కు శక్తినిచ్చేందుకు 4.5 kW హబ్ మోటార్(6 bhp) ఉంది. ఇక S1 ఎయిర్ మోడల్ కేవలం 3.3 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదని Ola Electric పేర్కొంది. S1 ఎయిర్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కి.మీ కావడం విశేషం.
Ola S1 ఎయిర్.. Ather 450S, TVS iQubeతో సహా అనేక ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడగలదని టెక్ నిపుణుల అంచనా. ఈ ఈ-స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌తో పాటు, స్కూటర్ వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్, డ్రమ్ బ్రేక్‌లు, బోల్డ్ నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్, యుటిలిటేరియన్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. నిజానికి ఈ స్కూటర్‌ను గత ఏడాదిలోనే ప్రకటించారు. అయితే దీని డెలివరీ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకున్న వారికి నేరుగా రూ.10,000 తగ్గింపు లభించడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి