
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకు సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రోడ్లస్టర్ ఎక్స్ బైక్స్ ఇటీవల కాలంలో ఓలా డీలర్ల వద్దకు చేరుతున్నాయి. ముఖ్యంగా డీలర్ల వద్ద ఈ బైక్స్‌ను చూసిన వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓలా కంపెనీ ఓలా రోడ్‌స్టర్ బైక్స్‌ను డెలిరీలను ప్రారంభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. రోడ్ స్టర్ ఎక్స్ బైక్స్ ఉత్పత్తి ఇటీవలే ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రారంభించారు. ఓలా రోడ్ స్టర్ ఎక్స్ మూడు ప్రత్యేకమైన వేరియంట్లలో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్లు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. ఓలా రోడ్ స్టర్ ఎక్స్ బ్యాటరీలు 2.5 కేడబ్ల్యూహెచ్, 3.5 కేడబ్ల్యూహెచ్, 4.5 కేడబ్ల్యూహెచ్ కలిగి ఉంటాయి. అయితే బ్యాటరీ ప్యాక్‌తో సంబంధం లేకుండా అన్ని వేరియంట్లు ఒకే 7 కేడబ్ల్యూ మిడ్-మౌంటెడ్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి.
ఓలా రోడ్లస్టర్ ఎక్స్‌కు సంబంధించిన ఎంట్రీ-లెవల్ మోడల్ 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బైక్ ఈ సిరీస్లో అత్యంత సరసమైన ఎంపికగా నిలిచింది. ఈ బైక్ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే ఈ వేరియంట్ పూర్తి ఛార్జ్ పై 140 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే 3.4 సెకన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే గరిష్టంగా 105 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. మిడ్-రేంజ్ వేరియంట్ 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బైక్ ధర రూ.84,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. బేస్ మోడల్‌తో పోలిస్తే ఈ బైక్ పూర్తి ఛార్జ్ పై 196 కిలోమీటర్ల మెరుగైన పరిధిని అందిస్తుంది. ఈ పెద్ద బ్యాటరీ వేరియంట్ 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే 118 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది.
ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ప్రీమియం మోడల్ 4.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బైక్ ధర రూ.94,999 (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ అత్యధిక బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ బైక్ పూర్తి ఛార్జ్ పై 252 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే 3.1 సెకన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే మిడ్-రేంజ్ వేరియంట్ మాదిరిగానే గరిష్టంగా 118 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఓలా రోడర్ ఎక్స్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లతో వస్తుంది. ఈ బైక్ 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. అలాగే ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ప్రతి వేరియంట్‌లో 4.3 అంగుళాల ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ వంటి పీచర్లు ఆకట్టుకుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..