Ola Electric Car: అద్భుతమైన ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కి.మీ మైలేజీ.. టెస్లాతో పోటీ..!

|

Aug 15, 2022 | 6:27 PM

Ola Electric Car: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంధనం ఇబ్బందుల నుంచి తప్పించేందుకు పలు..

Ola Electric Car: అద్భుతమైన ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కి.మీ మైలేజీ.. టెస్లాతో పోటీ..!
Ola Electric Car
Follow us on

Ola Electric Car: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంధనం ఇబ్బందుల నుంచి తప్పించేందుకు పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అందుబాటులోకి రాగా, మరి కొన్ని కంపెనీలు, స్కూటర్లు, కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక ఓలా నుంచి ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలైన విషయం తెలిసిందే. దేశంలో అత్యధికంగా అమ్ముడైన జాబితాలో ఓలా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ కార్ల వైపు అడుగు వేసింది. రానున్న రోజుల్లో తన ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఓలా.

ఇక తన మొదటి ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో విడుదల చేయనుంది. ఆగస్ట్ 15న పెద్ద ప్రకటన చేయబోతున్నామని ప్రకటించిన కంపెనీ.. తన మొదటి ఎలక్ట్రిక్ కారు 2024లో భారతదేశంలో విడుదల కానుంది. ఈ కారు రేంజ్ పరంగా టెస్లాతో నేరుగా పోటీపడనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారు పైకప్పు పూర్తిగా గ్లాస్‌తో ఉంటుందని వెల్లడించింది.

తమ ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ ఇవ్వగలదని, ఇది టెస్లాతో నేరుగా పోటీపడుతుందని తెలిపింది. ఓలా కారును MoveOSలో డ్రైవ్ చేస్తుంది. ఇది హ్యాండ్‌లెస్, కీలెస్ ఎంట్రీ కారు. ఈ కారు గురించి కంపెనీ తాజాగా ఓ ప్రకటన చేసింది. రానున్న రెండేళ్లలో తమ కారును భారత్‌లో విడుదల చేయనున్నట్లు ఓలా తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి