Ola Electric Scooter Bookings: ఆన్‌లైన్ ద్వారా వాహన సేవలను అందజేస్తోన్న ఓలా కంపెనీ దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టదలచిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనూహ్య ఆదరణ లభిస్తోంది. దేశంలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లో భారీ గిరాకీ పలికింది. ప్రకటన వెలువడిన ఒక్కరోజులోనే ఏకంగా లక్ష బుకింగ్‌లు వచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్శనివారం వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను వినియోగదారులకు అందుబాటులోకి తీసువస్తున్నట్లు ప్రకటించింది. గురువారం సాయంత్రం నుంచి బుకింగ్స్ప్రారంభించింది. దీంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని సంస్థ సీఈఓ హర్షం వ్యక్తం చేశారు.
“దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆనందంగా ఉంది. ప్రజలు ఎలక్ట్రానిక్వెహికిల్స్వైపు మొగ్గు చూపుతున్నారు అనడానికి ఇది నిదర్శనం. వాహన తయారీ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలన్న మా లక్ష్యానికి ముందడుగు పడింది.” అని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్తెలిపారు. త్వరలోనే ఓలా ఈ స్కూటర్ ఫీచర్స్, ధర మొదలైన వివరాలను సంస్థ వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌ను తక్కువ ధరకే విక్రయిస్తామని సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. స్కూటర్ వేగం, బూట్‌స్పేస్, రేంజ్ఉన్నతస్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసింది.
‘మేడ్ ఇన్ ఇండియా’ నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పరిధిలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఫ్యాక్టరీని ఓలా ఎలక్ట్రిక్ స్థాపించింది. దేశంలో రోజురోజుకూ పెరుగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఏ స్థాయిలో డిమాండ్ నెలకొని ఉందనే విషయాన్ని ఓలా వాహనాలు స్పష్టం చేసినట్టయిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు దేశంలో క్రమంగా డిమాండ్ పెరుగుతోందనేది బహిరంగ రహస్యం. ఇంధన ధరల పెరుగుదల దీనికి ఓ ప్రధాన కారణమైంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ సెక్టార్‌లో ఉన్న టాప్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆసక్తి చూపుతోన్నాయి. బజాజ్, ఏథర్ వంటి కంపెనీలు కూడా ఇప్పటికే ఈ సెక్టార్‌లో అడుగు పెట్టేశాయి. తాజాగా ఓలా ఎంట్రీ ఇచ్చింది. స్కూటర్ బుకింగ్స్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే లక్ష వాహనాలు రిజర్వ్ అయ్యాయి. ఈ పరిణామం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందంటూ ఓలా ఛైర్మన్ అండ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భావేష్ అగర్వాల్ పేర్కొన్నారు.
India’s EV revolution is off to an explosive start. ??? Huge thanks to the 100,000+ revolutionaries who’ve joined us and reserved their scooter. If you haven’t already, #JoinTheRevolution at https://t.co/lzUzbWbFl7 @olaelectric pic.twitter.com/LpGbMJbjxi
— Bhavish Aggarwal (@bhash) July 17, 2021
ఇదిలావుంటే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఒక్కసారి బ్యాటరీని చార్జ్ చేస్తే 240 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించే వీలుంది. వేగం పెరిగే కొద్దీ ప్రయాణ సమయం తగ్గుతుంటుంది. 499 రూపాయలను చెల్లించి ఓలా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అమౌంట్ నామమాత్రంగా ఉండటం కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ భారీగా పెరగడానికి ఓ కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ ఓలా స్కూటర్ ధర లక్ష రూపాయల నుంచి లక్షా 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, జీపీఎస్ నావిగేషన్ అందుబాటులో ఉంటుంది. బ్లూటూత్ ద్వారా 4జీ కనెక్టివిటీ సౌకర్యం ఉంది.
Read Also… CLAT EXAM -2021 : జూలై 23న క్లాట్ పరీక్ష అడ్మిట్ కార్డులు జారీ.. పరీక్ష మార్గదర్శకాలు విడుదల..