Ola Battery: అయ్యబాబోయ్..! ఓలా స్కూటర్ బ్యాటరీ ఇంత ఖరీదా? సోషల్ మీడియాలో పెలుతున్న జోకులు

|

Feb 18, 2023 | 4:45 PM

ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ జీవితకాలం ఎంత? ఒకవేళ బ్యాటరీ చెడిపోతే దాన్ని మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయంపై కొత్త భయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఓలా ఎస్ 1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో బ్యాటరీ ప్యాక్‌ని మార్చడానికి మీరు ఎంత ఖర్చవుతుందో? తెలిసి వాహనదారులు అవ్వాకవుతున్నారు.

Ola Battery: అయ్యబాబోయ్..! ఓలా స్కూటర్ బ్యాటరీ ఇంత ఖరీదా? సోషల్ మీడియాలో పెలుతున్న జోకులు
Ola Electric
Follow us on

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దేశంలోని చాలా పట్టణాల్లోని ప్రజలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. స్కూటర్ల విభాగంలో ముఖ్యంగా ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా భారత్‌లో వినియోగిస్తున్నారు. అయితే ఈవీ వాహనదారులు ఇంటర్నెట్ లో ఓ వార్త చూసి ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ జీవితకాలం ఎంత? ఒకవేళ బ్యాటరీ చెడిపోతే దాన్ని మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయంపై కొత్త భయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఓలా ఎస్ 1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో బ్యాటరీ ప్యాక్‌ని మార్చడానికి మీరు ఎంత ఖర్చవుతుందో? తెలిసి వాహనదారులు అవ్వాకవుతున్నారు. బ్యాటరీ ప్యాక్‌లు రవాణా చేసే ఓ సంస్థ బ్యాటరీ ప్యాక్ రేట్‌ ఉన్న స్టిక్కర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు కొత్త భయాలు మొదలయ్యాయి. 2.98 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ రూ.66,549, 3.97 కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీ ప్యాక్ ధర రూ.87,298గా ఉండడంతో అంతా షాక్ అవుతున్నారు. 

ఓలా ఎస్ 1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు చాలా మందిని ఆకర్షించాయి. ఈ బైక్‌ల ధర కూ రూ.99,999 నుంచి ప్రారంభవుతున్నాయి. అయితే బ్యాటరీల ధర మాత్రం రూ. 66,549, రూ.87,298గా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ధరలను బట్టి ఓలా ఎంత మంచి బ్యాటరీలను వాడుతుందో? అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు, ఓలా స్కూటర్లలో బ్యాటరీ మార్పు కేసులేవీ బయటపడలేదు. అయితే వారంటీలో ఉన్న సమయంలో బ్యాటరీ అయిపోతే పర్లేదు గానీ, వారెంటీ లేని సమయంలో మాత్రం కస్టమర్ల జేబులకు చిల్లు పడుతుంది. గతంలో ఎప్పుడో తీసుకున్న వాహనాలకు కస్టమర్లు బ్యాటరీలు మారుస్తున్నారు. కానీ కొత్త టెక్నాలజీతో వస్తున్న స్కూటర్ల బ్యాటరీలు మార్చే పరిస్థితి ఇప్పటివరకూ లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఓలా స్కూటర్ల బ్యాటరీ ధరపై సోషల్ మీడియాలో మాత్రం జోకులు పేలుతున్నాయి. బ్యాటరీ ధర అంత ఉంటే పెట్రోల్ వాహనాలే బెటరని కొంత మంది సూచిస్తున్నారు. మరికొంతమందైతే ధరలో డిజిట్స్ ఎక్కువయ్యాయని తమదైన శైలిలో మండిపడుతున్నారు. ఓలా స్కూటర్ బ్యాటరీ ధరలతో మీమర్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. రకారకాల మీమ్స్ తయారు చేసి ఫాలోయర్స్ నవ్వు తెప్పిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..