OLA Electric Car: భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత OLA ఎలక్ట్రిక్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో దూసుకెళ్లేందుకు కంపెనీ సన్నాహాలు కూడా చేస్తోంది. జూన్ 19న ‘ఓలా కస్టమర్ డే’ సందర్భంగా, కంపెనీ తమిళనాడులో కొత్త యూనిట్‌కు వినియోగదారులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారుకు చెందిన 30 సెకన్ల టీజర్‌ను విడుదల చేశారు.
3 ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి..
ఓలా విడుదల చేసిన టీజర్‌లో మూడు కార్లు కనిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. EV స్టార్టప్ కంపెనీ ఏకకాలంలో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారిస్తోంది. అదే సమయంలో ఓలా సెడాన్ లుక్ చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్‌లో అలాంటి రూపాన్ని సాధించడం చాలా కష్టం. వెడ్జ్ షేప్ ఫ్రంట్, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను టీజర్‌లో చూపించారు.
ఆగస్టు 15న మరింత సమాచారం..
రాబోయే కారు స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే, ఆగస్టు 15న మరింత సమాచారం అందిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. రాబోయే ఎలక్ట్రిక్ కారును స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేయవచ్చు. ఓలా కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
రాబోయే ఎలక్ట్రిక్ కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను బట్టి, 500 కిమీ కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. అంటే దాదాపు 60-80kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఓలా ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించవచ్చు. అయితే హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV వేర్వేరు స్పెసిఫికేషన్‌లను పొందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి