OLA Electric Cars: రోజురోజుకీ ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 90 దాటితేనే వామ్మో అనుకునే పరిస్థితులు ఉండేవి కానీ ఇప్పుడు ఏకంగా రూ. 110 దాటేసింది. దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సమయంలోనే ఎలక్ట్రానిక్ వాహనాలు రంగంలోకి దిగాయి. ఇంధన ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులు సైతం విద్యుత్‌తో నడిచే కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతే కాకుండా ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి రాయితీలు ప్రకటించడంతో తయారీదారులు కూడా ఈ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పోటీలో ఓలా ముందు వరుసలో నిలుస్తోంది.
Reject Petrol! Future is Electric ??? pic.twitter.com/3YrP9VHeJC
— Bhavish Aggarwal (@bhash) August 16, 2021
ఓలా కంపెనీ ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓలా సీఈఓ భావిష్ అగర్వాల్ ఆగస్టు 16న స్కూటర్ ఫస్ట్‌లుక్‌ను పరిచయం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘పెట్రోల్‌ను వదిలేయండి.. ఇక భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు ఇదే ట్వీట్ ఈ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ కార్లు కూడా రానున్నాయనే ప్రకటనకు దారి తీసింది. ఇంతకీ విషయేమంటంటే.. ఓలా సీఈఓ చేసిన ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ… ‘మీ కారు పెట్రోల్‌తో నడుస్తుందా.? డీజిల్‌తో నడుస్తుందా.?’ అంటూ కాస్త సెటైరికల్‌గా కామెంట్ చేశాడు. దీంతో దీనినే అవకాశంగా భావించిన భావిష్.. ‘నాకు అసలు రెండు నెలల క్రితం వరకు సొంత కారు లేదు. ప్రస్తుతం హైబ్రిడ్ కారును ఉపయోగిస్తున్నాను. కానీ 2023లో ఎలక్ట్రిక్ కారును ఉపయోగించనున్నాను. అది ఓలా ఎలక్ట్రిక్ కారు’ అంటూ అసలు విషయం చెప్పేశాడు. దీనిబట్టి చూస్తే ఓలా నుంచి 2023లో ఓలా కార్లు రానున్నాయన్నమాట. అయితే అగర్వాల్ ఈ కార్ల గురించి పెద్దగా విషయాలు ఏవీ పంచుకోలేదు.
Never owned a car till 2 months ago. Now a hybrid. Next one will be electric in 2023. Ola’s electric car ?
— Bhavish Aggarwal (@bhash) August 16, 2021
ఇదిలా ఉంటే ఓలా భారత మార్కెట్లోకి ఆదివారం ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బైక్‌కు రెండు వేరియెంట్లలో తీసుకురానున్నారు. ఓలా ఎస్1 ధర రూ. 99,999 కాగా, ఓలా ఎస్1 ప్రో ధర రూ. 1,29,999గా ఉంది. ఈ స్కూటర్లపై ఆయా రాష్ట్రాలు సబ్సీడీలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఓలా ఈ స్కూటర్ల తయారీని తమిళనాడులోని క్రిష్ణగిరిలోని ఫ్యాక్టరీలో చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రతీ ఏటా కోటి స్కూటర్లను తయారు చేయనుంది.
Crime News: చెల్లెలితో యువకుడి ప్రేమాయణం.. అది తెలిసిన ఆ ఇద్దరు సోదరులు ఏం చేశారంటే..