ఆగస్ట్ 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా కొత్త కానుకను దేశంలో విడుదల చేయనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పంద్రాగస్టున విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించారు. ఈ విషయాన్ని ఓలా స్కూటర్ సీఈవో భవీష్ అగర్వాల్ ధృవీకరించారు. ట్విటర్ వేదికగా ఓలా స్కూటర్‌ను ఎప్పుడు ప్రారంభించబోతున్నది ఆయన ప్రకటించారు.
దాని కోసమే ఎదురు చూస్తన్నా..
‘మా స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఆగస్టు 15న ఓలా స్కూటర్ లాంచ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నాం. దీనిపై మరిన్ని వివరాలు, విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం. దాని కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.
ఓలా స్కూటర్ ధరపై వీడని సస్పెన్స్..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయంలో మార్కెట్‌లో ఇప్పటికీ సస్పెస్ వీడలేదు. పెట్రోల్ ధరల పెరుగుదల, కాలుష్యం లాంటి కారణాలతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనల కొనుగోలుపై మొగ్గుచూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాటరీ ఆధారిత వాహనాలకు రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఫీజులపై మినహాయింపు ఇచ్చింది. తద్వరా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించ వచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ ధర ఎంత వరకు ఉంటుందన్న విషయంలో పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ఓలా స్కూటర్‌ను 10 రంగుల్లో ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ ఇది వరకే ప్రకటించింది.
Thanks to all who have reserved our scooter!
Planning a launch event for the Ola Scooter on 15th August. Will share full specs and details on product and availability dates. Looking forward to it! ?
— Bhavish Aggarwal (@bhash) August 3, 2021
Read this also: Petrol And Diesel Price: వాహనదారులకు ఊరట కలిగిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా రేట్లు ఇలా ఉన్నాయి..!