దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. మన్నటి వరకూ అనేక హామీలు గుప్పించాయి రాజకీయ పార్టీలు. అయితే నిన్నటితో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దీంతో నిత్యవసర ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ముఖ్యంగా గ్యాస్ బండ సామాన్యుడి పాలిట గుదిబండగా మారింది. నెలలో ఒకటో తేది కావడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ ఆయిల్ కంపెనీలు వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో కొన్ని మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1796కి చేరింది. ఇక గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం రూ. 918 కే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మన తెలుగు రాష్ట్రాలలో కమర్షియల్ వంట గ్యాస్ ధర రూ. 2024కు చేరింది. ఇక చెన్నైలో రూ.1,968.5, కోల్‌కతాలో రూ.1,908గా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ చదవండి..