Cash Withdraw with UPI App: ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటున్నారా? మీ వద్ద డెవిట్ కార్డ్ లేదా? మరేం పర్వాలేదు. మీ ఫోన్‌లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ మొబైల్ వ్యాలెట్స్ ఉంటే చాలు. వాటి ఆధారంగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకువోచ్చు. ఇదే విషయాన్ని ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్ కార్పొరేషన్ వెల్లడించింది. యూపీఐ ఆధారిత యాప్‌లతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేలా కొత్త టెక్నాలజీని తీసుకువచ్చినట్లు.. ఎన్‌సీఆర్ కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటికే 1500 లకు పైగా ఏటీఎంలలో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టగా.. దేశ వ్యాప్తంగా మరిన్ని ఏటీఎంలలోనూ ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. యూపీఐ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటీఎం నుంచి నగదు తీసుకోండిలా..
1. ముందుగా మీ మొబైల్‌లోని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
2. ఆ యాప్ మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానితమై ఉండాలి.
3. ఆ తరువాత ఏటీఎంలో క్యూఆర్ క్యాష్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఏటీఎం తెరపై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
4. అలా స్కాన్ చేసిన తరువాత డిజిటల్ యూపీఐ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఓకే చేసిన తరువాత ఏటీఎం మెషీన్ నుంచి నగదు వస్తుంది.
5. అయితే, ప్రస్తుతానికి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా గరిష్ఠంగా రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. భవిష్యత్‌లో పెంచే అవకాశం ఉందని అంటున్నారు.
Also read: