LIC Whatspp: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. వాట్సాప్‌ ద్వారా సేవలు పొందే అవకాశం..

|

Dec 03, 2022 | 8:20 AM

దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రకాల కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను సైతం అందిపుచ్చుకుంటున్నారు...

LIC Whatspp: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. వాట్సాప్‌ ద్వారా సేవలు పొందే అవకాశం..
Whatsapp Lic
Follow us on

దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు రకాల కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను సైతం అందిపుచ్చుకుంటున్నారు. కస్టమర్లు తమ పాలసీకి సంబంధించిన వివరాలను సులువుగా తెలుసుకునేందుకు తాజాగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. బీమా సేవలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ద్వారా పొందే అవకాశం కల్పించారు.

ఈ వాట్సాప్‌ సేవల ద్వారా వినియోగదారులు బీమా ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సమాచారం పొందొచ్చు. ఇందు కోసం 8976862090 నెంబర్‌ ద్వారా సేవలు పొందొచ్చు. రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో పైన పేర్కొన్న నెంబర్‌కు మెసేజ్‌ చేయడం ద్వారా బీమా సంబంధిత వివరాలను తెలుసుకోవచ్చు. బీమాకు సంబంధించి ఇకపై ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం ఎదురు చూడకుండా మెరుగైన సేవలు అందించడానికే.. వాట్సాప్ సర్వీసులను ప్రారంభించినట్టు ఎల్ఐసీ ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్‌ ద్వారా పొందే సేవలు..

* ప్రీమియం డ్యూ

* బోనస్‌ ఇన్ఫర్మేషన్‌

* పాలసీ స్టాటస్‌

* లోన్‌ ఎలిజిబిలిటీ కొటేషన్‌

* లోన్‌ రీపేమెంట్ కొటేషన్‌

* లోన్‌ ఇంట్రెస్ట్ రేట్‌

* ప్రీమియం పెయిడ్‌ సర్టిఫికేట్‌

* యూఎల్ఐపీ – స్టేట్‌మెంట్ ఆఫ్‌ యూనిట్స్‌

* ఎల్‌ఐసీ సర్వీస్‌ లింక్స్‌

* ఆప్ట్‌ ఇన్‌/ఆప్ట్‌ అవుట్‌ సర్వీస్‌

* ఎండ్‌ కన్వర్జేజన్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..