Akasa Air: 43 మంది పైలట్లు రాజీనామా.. మూసివేత దిశగా ఎయిర్‌లైన్.. కారణం ఏంటంటే..

|

Sep 20, 2023 | 4:23 PM

ఈ విమానయాన సంస్థ 13 నెలల క్రితమే చాలా ఆర్భాటంగా ప్రారంభించబడింది. బిగ్ బుల్ ఆఫ్ ది మార్కెట్‌గా పేరుగాంచిన దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీ కేవలం 13 నెలల్లోనే దిగజారింది. కంపెనీకి చెందిన 43 మంది పైలట్లు కలిసి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఏకకాలంలో 43 మంది పైలట్లు రాజీనామా చేయడంతో కంపెనీ ప్రతిరోజూ..

Akasa Air: 43 మంది పైలట్లు రాజీనామా.. మూసివేత దిశగా ఎయిర్‌లైన్.. కారణం ఏంటంటే..
Akasa Air
Follow us on

విమానయాన పరిశ్రమ రోజులు బాగా లేవు. పరిస్థితులు బాగా లేనందున కొన్ని విమానయాన సంస్థలు దివాళా తీస్తున్నాయి. చివరకు మూత పడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. తీవ్ర నష్టాలలో కొనసాగుతున్న విమానయాన సంస్థలకు గడ్డు కాలమనే చెప్పాలి. ఇప్పుడు ఆకాస ఎయిర్ నుంచి ఓ పెద్ద వార్త వస్తోంది. ఈ విమానయాన సంస్థ మూతపడే ప్రమాదం ఉందని ఎయిర్‌లైన్స్‌ వర్గాల ద్వారా సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ విమానయాన సంస్థ 13 నెలల క్రితమే చాలా ఆర్భాటంగా ప్రారంభించబడింది. బిగ్ బుల్ ఆఫ్ ది మార్కెట్‌గా పేరుగాంచిన దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన ఈ కంపెనీ కేవలం 13 నెలల్లోనే దిగజారింది.

కంపెనీకి చెందిన 43 మంది పైలట్లు కలిసి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఏకకాలంలో 43 మంది పైలట్లు రాజీనామా చేయడంతో కంపెనీ ప్రతిరోజూ 24 విమానాలను రద్దు చేయాల్సి వస్తోంది. కంపెనీ మూతపడే ప్రమాదం ఉందని స్వయంగా అంగీకరించింది. ఇలాంటి ఆకస్మిక రాజీనామాల కారణంగా కంపెనీ మూతపడే దశలో ఉందని కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పేర్కొంది.

600 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది

మీడియా కథనాల వివరాల ప్రకారం.. ఆకాశానికి చెందిన పైలట్లు ఇక్కడి నుండి రాజీనామా చేసి ఎయిర్ ఇండియాలో చేరుతున్నారు. ఈ పైలట్లు నోటీసు వ్యవధిని అందించలేదు. అకాసా ఎయిర్ ప్రతి రోజు 120 విమానాలను నడుపుతోంది. అయితే హఠాత్తుగా ఇంత పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడంతో ఆగస్టు నెలలో కంపెనీ దాదాపు 600 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నెలలో కూడా విమానాలను రద్దు చేయడం మినహా కంపెనీకి వేరే మార్గం లేదు. ఇప్పుడు విమానాలు నడపడానికి కంపెనీ పైలట్ల కొరతను ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

కంపెనీ కోర్టులో అప్పీలు చేసింది:

పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఆకాశ కోర్టును ఆశ్రయించింది. తప్పనిసరి నోటీసులను అందజేసే నిబంధనలను అనుసరించాల్సిందిగా విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏను కోరాలని కంపెనీ కోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి, నిబంధనల ప్రకారం, ఆఫీసర్ గ్రేడ్ కోసం 6 నెలల నోటీసును అందించడం అవసరం. అయితే కెప్టెన్‌కి నోటీసు వ్యవధి ఒక సంవత్సరం. అందువల్ల, పైలట్ నోటీసు వ్యవధిని అందించాలని కంపెనీ కోర్టును కోరింది. అయితే ఈ విషయంలో కంపెనీ దీనిపై కోర్టులో అప్పీల్ చేసినందున దీన్ని చేయలేమని డీసీజీఏ స్పష్టం చేసింది. ఇలా విమానయాన సంస్థలు పరిస్థితులు దిగజారడంతో పైలట్లకు తీవ్ర ఇబ్బందిగా మారిపోతోంది. వారి ఉద్యోగాలు మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి