AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ వాడేవారికి బిగ్ న్యూస్.. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా పేమెంట్స్ బంద్.. నిలిచిపోనున్న సేవలు..

యూపీఐ వాడేవారికి బ్యాడ్ న్యూస్. అక్టోబర్ 2వ తేదీన యూపీఐ పేమెంట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. వ్యాపారుల యూపీఐ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు చేట్టాలని వ్యాపార సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో యూపీఐ పేమెంట్లు బంద్ అయ్యే అవకాశముంది.

UPI Payments: యూపీఐ వాడేవారికి బిగ్ న్యూస్.. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా పేమెంట్స్ బంద్.. నిలిచిపోనున్న సేవలు..
Upi Payments
Venkatrao Lella
|

Updated on: Sep 30, 2026 | 2:50 PM

Share

రూ.2 వేలుపైబడిన UPI లావాదేవీలపై ఎండీఆర్(MDR) రుసుంలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో అమలుకు రంగం సిద్దమైంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఎండీఆర్ ఛార్జీలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు రూ.2 వేలకుమించి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వ్యాపారుల నుంచి ఈ ఛార్జీలను బ్యాంకులు, పేమెంట్ ఫ్లాట్‌ఫామ్స్ వసూలు చేయనున్నాయి. రూ.2వేలకు మించితే 0.4 శాతం చొప్పున వసూలు చేయనుండగా.. గరిష్ట పరిమితి రూ.300 విధించారు. ఈ ఛార్జీలు వ్యాపారులే భరించాలని, సామాన్యులపై వేయడానికి వీల్లేదని కేంద్రం ప్రకటించింది. దీని వల్ల వ్యాపారులపై భారం పడనుంది. దీంతో ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 2న నో యూపీఐ డే

యూపీఐ ఛార్జీలకు నిరసనగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే'(No UPI Day) పాటిస్తామని CTI ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా ఆ రోజు వ్యాపారులు UPI క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులను నల్ల గుడ్డతో కప్పి నిరసన వ్యక్తం చేయనున్నారు.  ఢిల్లీ లజపత్ నగర్ మార్కెట్ నుంచి నో యూపీఐ డే ప్రచారం ప్రారంభమవ్వగా.. దేశవ్యాప్తంగా 2000కుపైగా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగనున్నాయి. డిజిటల్ చెల్లింపులపై రుసుంలు విధిస్తే UPI లావాదేవీలు 50 శాతం తగ్గే ప్రమాదముందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు నిరసనల్లో భాగంగా అక్టోబర్ 2న యూపీఐ క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్‌లను నల్లటి వస్త్రంతో కప్పి ఉంచుతారు. ఆ రోజు యూపీఐ పేమెంట్లను స్వీకరించరు. దీని వల్ల దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్లు బంద్ అయ్యే అవకాశముంది. యూపీఐ పేమెంట్లు చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

యూపీఐ ఛార్జీలు ఎందుకు..?

యూపీఐ వ్యవస్థ నిర్వహణ, బలోపేతం కోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌ అవసరాలకు సరిపోవడం లేదు. దీంతో యూపీఐ ఛార్జీలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. వ్యాపారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు యూపీఐ వ్యవస్థ నిర్వహణ కోసం ఉపయోగించనున్నారు. ఈ ఛార్జీలు నేరుగా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు వెళతాయి. కేంద్ర ప్రభుత్వానికి ఈ నిధులు అందవు. యూపీఐ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ ఛార్జీలు కస్టమర్లపై వ్యాపారులకు మోపకుండా చూసుకునే బాధ్యతలను బ్యాంకులకు కేంద్రం అప్పగించింది. ఈ ఛార్జీల వల్ల యూపీఐ లావాదేవీలు తగ్గుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Follow Us