వాషింగ్టన్ : అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న దిగుమతి పన్నులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకమైనవి కాదని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారం కోసం జరిగే చర్చలో భారత్ సరైన వివరాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా భారత్‌పై అసంతృప్తి వెల్లగక్కారు.
భారత్ అధిక పన్నులు విధిస్తుందంటూ ట్రంప్ పలుమార్లు ట్విటర్ ద్వారా భారత్‌ను విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్‌నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కు తదితర వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్యలతో భారత్ దారికొస్తుందని భావించిన అమెరికాకు భారత్ ఉహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 28 రకాల అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచడంతో అమెరికా షాక్‌కు గురైంది. దీంతో భారత్‌ను అమెరికా ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహక దేశాల జాబితానుంచి తొలగించింది.
ఇటీవల జరిగిన జీ-20 సమ్మిట్‌లో మోదీ-ట్రంప్‌ల మధ్య చర్చలు జరిగాయి. వాణిజ్య వివాదంపై ఇరువురు నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారనే అందరూ భావించారు. కానీ ట్రంప్ తాజా ట్వీట్‌తో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
India has long had a field day putting Tariffs on American products. No longer acceptable!
— Donald J. Trump (@realDonaldTrump) July 9, 2019