Nitin Gadkari: దేశంలో రహదారి నిర్మాణ ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడుల సేకరణను విదేశీ మదుపరులకు సేకరించేదిలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా చిన్నమెుత్తంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్న దేశీయ రిటైల్ మదుపరులకు అవకాశం కల్పిస్తామన్నారు. కనీసం రూ. లక్ష పెట్టుబడిగా పెట్టాలనుకునేవారికి 8 శాతం వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు. దేశంలో జరుగుతున్న రోడ్లు, పైవంతెనలు, రైల్వే క్రాసింగుల నిర్మాణానికి సుమారు రూ. 8,000 కోట్ల అవసరమని త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన చేయనున్నట్లు వెలువరించనున్నట్లు స్పష్టం చేశారు.
ఏడాదికి కేంద్ర రహదారుల శాఖ రూ. 5 లక్షల కోట్ల వరకు విలువైన నిర్మాణ పనులను చేపడుతూ ఉంటుందని వివరించారు. ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులు అమితాసక్తి చూపుతున్నారని.. తాము మాత్రం దానికి ఆసక్తిచూపడం లేదని అన్నారు. ”ధనికులను మరింత ధనికులుగా చేయదలుచుకోవడం లేదు. దానికి బదులు దేశంలోని రైతులు, రైతు కూలీలు, చిరు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు” భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించున్నట్లు మహరాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సదస్సులో పేర్కొన్నారు.
చిన్న మెత్తంలో కనీసం రూ. లక్ష పెట్టుబడి పెట్టడం వల్ల మదుపరులకు ప్రభుత్వం హామీతో 8 శాతం వడ్డీని చెల్లిస్తామని చెప్పారు. ఇదే మెత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే కేవలం 4.5 నుంచి 5 శాతం వరకు మాత్రమే ప్రయోజనమని.. అందువల్ల ఈ అవకాశం అనేక మందికి ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం సెబీ వద్ద పరిగణలో ఉందని చెప్పారు. ఒక్కసారి చట్టపంగా అనుమతులు పొందగానే.. రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. గత కొంత కాలంగా విదేశీ సంస్థలు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయని.. కానీ దేశీయంగా డబ్బు సమీకరించే సమయం వచ్చిందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. గతంలో ఫారెన్ ఇన్వెస్టర్లకు భారత్ మసాలా బాండ్లు అమ్మేందుకు ప్రయత్నించగా వారు విముకత చూపిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇవీ చదవండి…
Banking News: ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు విడుదల.. పెరిగిన నికర లాభం..!
Market News: పీఎం గతిశక్తితో ఎక్కువ లాభపడనున్న ఆ సెక్టార్.. దేశంలో ఉపాధి కల్పనకూ ఊతం..
Meta News: అక్కడ సేవలు నిలిపేస్తామన్న మెటా.. ఫేస్ బుక్, ఇన్ట్సాగ్రామ్ కు వినియోగదారులు దూరం!