
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. కేవలం 5 సీటర్ వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్ వార్షిక పాస్(FASTag Annual Pass)లు మంజూరు చేస్తారని, 7 సీటర్ వాహనాలకు ఇవ్వరనే వార్త ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా NHAI స్పందించింది. అదంతా ఫేక్ న్యూస్ అని.. అన్ని రకాల నాన్ కమర్షియల్ వెహికల్స్‌కి వార్షిక పాస్ ఇస్తామని ప్రకటించింది. అందులో కారు, జీపు, వ్యాన్ వంటి అన్ని రకాల నాన్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి.
అసలేంటి ఈ అన్యువల్ పాస్..?
ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 ఆగస్టు 15న ప్రారంభించిన ఒక కొత్త విధానం. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు సంవత్సరానికి రూ.3,000 చెల్లించి, 200 టోల్ క్రాసింగ్‌లను (ట్రిప్పులు) పొందేలా ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఇది 1 సంవత్సరం లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యే వరకు చెల్లుతుంది. దీనిని ‘రాజ్‌మార్గయాత్ర’ యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
#FactCheck: NHAI would like to clarify that all non-commercial Car/Jeep/Van with active FASTag, are eligible for the Annual Pass.
Kindly refrain from spreading fake news. @MORTHIndia @PIBMoRTH @PIBFactCheck #NHAI #FASTagAnnualPass pic.twitter.com/KmTbuXLH0n— NHAI (@NHAI_Official) January 25, 2026
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి