Elon Musk: కోకాకోలా కొంటా.. కొకైన్ కలిపి అమ్ముతా.. ఎలన్‌ మస్క్‌ మరో సంచలనం..

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు హస్తగతం చేసుకున్నారు ప్రముఖ బిలియనీర్ ఎలన్‌ మస్క్‌ (Elon musk).

Elon Musk: కోకాకోలా కొంటా.. కొకైన్ కలిపి అమ్ముతా..  ఎలన్‌ మస్క్‌ మరో సంచలనం..
Elon Musk

Updated on: Apr 28, 2022 | 11:22 AM

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు హస్తగతం చేసుకున్నారు ప్రముఖ బిలియనీర్ ఎలన్‌ మస్క్‌ (Elon musk). ఆ సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసిన ఈ అపరకుబేరుడు తాజాగా తన తదుపరి టార్గెట్‌ను ప్రకటించాడు. అదే కోకాకోలా .. దీనిపై టెస్లా సీఈవో చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో తన తదుపరి లక్ష్యం కోకాకోలాను కొనడమేనని చెప్పుకొచ్చిన అతను.. అందులోకి ఇల్లీగల్‌ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కలపడమే తన లక్ష్యమంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆ తరువాత మరో పాత ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అందులో ‘ఇప్పుడు నేను మెక్‌డొనాల్డ్స్ కొనబోతున్నాను. అక్కడి అన్ని ఐస్ క్రీమ్ మెషీన్‌లను సరిచేయబోతున్నాను’ అని రాసి ఉంది. ఈ ట్వీట్ ను షేర్ చేస్తూ ‘అందరూ వినండి నేను అద్భుతాలు చేయలేను’ అని క్యాప్షన్‌ జోడించాడు.

కాగా ఎలన్ మస్క్ ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. ట్విట్టర్ ను టేకోవర్ చేయడానికి ముందు కూడా ఇలాంటి ట్వీట్లతోనే సంచలనం సృష్టించాడీ అపర కుబేరుడు. అంతకుముందు టెస్లా వాటా, షేర్లు అమ్మడంపై ట్విట్టర్ వినియోగదారులకు పోల్ కూడా నిర్వహించాడు. ఆ పోల్ ప్రకారం దాదాపు 7 బిలియన్ల డాలర్ల టెస్లా షేర్లను విక్రయించాడు. ఇక ట్విటర్ కొనుగోలు చేయడానికి కొద్ది రోజుల ముందు.. ట్విట్టర్ ను మెరుగుపరిచేందుకు తానేం చేయదల్చుకున్నాడో మదిలో మెదిలిన ఆలోచనలను పంచుకున్నాడు. అందులో కొన్ని చాలా తీవ్రమైనవిగా కనిపించాయి. ముఖ్యంగా ఎడిట్ బటన్ ను ప్రవేశపెట్టడం, ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయాన్ని నిరాశ్రయుల ఆశ్రయంగా మార్చడం వంటి ప్రకటనలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు ఈ కోవలోనే కోకా కోలాపై సరదాగా ట్వీట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత మస్క్‌ ఏం చేస్తాడోనని తీవ్ర చర్చ జరుగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Perfumes: ఈ 5 పెర్ఫ్యూమ్‌లు మహిళలకు గుడ్‌.. వేసవిలో తాజాగా ఉంచుతాయి..!

Radhe Shyam: చేసిన ఆ ఒక్క మంచి పని వల్లే… తీవ్ర నష్టం నుంచి బయటపడ్డాడు

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్‌.. కొవిడ్ నుంచి కోలుకున్న మార్ష్‌, సీఫెర్డ్‌.. ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరు..