
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం బ్యాంకులు కూడా తమ ఖాతాదారులను ఆకట్టుకోడానికి ఫోన్ లోనే బ్యాంకింగ్ సేవలను అందించడం మొదలుపెట్టాయి. అలాగే ప్రభుత్వం కూడా డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించడానికి యూపీఐ ను కూడా ప్రవేశపెట్టింది. ముఖ్యంగా యూపీఐ బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టడంతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ వంటి వాటి అవసరం లేకుండానే ఖాతాదారులు తమ ఖాతాల్లోని నగదును వేరే వారికి పంపుతున్నారు. సో బ్యాంకుల్లో రద్దీ కూడా తగ్గింది. అయితే ఖాతాదారులు యూపీఐ సేవలను పొందాలంటే కచ్చితంగా డెబటి కార్డును వాడి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనతో కొంతమంది ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందిని పరిగిణలోకి తీసుకున్న్ పంజాబ్ నేషనల్ డెబిట్ కార్డు అవసరం లేకుండా కేవలం ఆధార్ ఆథంటికేషన్ ద్వారా యూపీఐ సేవలను అందిస్తామని పేర్కొంది. ఇది ఆ బ్యాంకు ఖాతా దారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే పీఎన్ బీ ఖాతాదారులు డెబిట్ కార్డు లేకుండా ఆధార్ నెంబర్ తో యూపీఐ సేవలను ఎలా పొందవచ్చో? ఓ సారి చూద్దాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..