
ఏపీ ప్రజలకు రైల్వేశాఖ మరో అదిరిపోయే శుభవార్త అందించింది. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఏపీ మీదుగా కొన్ని అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతుండగా.. ఇప్పుడు మరోకటి అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కొత్త రైలు జనవరి 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఏపీలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ కొత్త ట్రైన్ ఆగనుంది. దీనికి సంబంధించిన రూట్, టైమ్ షెడ్యూల్స్ వివరాలను రైల్వేశాఖ విడుదల చేసింది. ఈ కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
బెంగళూరు-అలీపుర్దువార్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. బెంగళూరు నుంచి ఏపీ మీదుగా పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్దువార్ వరకు వెళుతుంది. ఏపీలోని కుప్పం, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకొట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్త వలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. దీంతో ఈ రూట్లల్లో ప్రయాణించేవారితో పాటు బెంగళూరు వెళ్లేవారికి ఈ ట్రైన్ బాగా ఉపయోగపడనుంది.
బెంగళూరు-అలీపుర్దువార్(16597/16598) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం ఉదయం 8.50 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరుతుంది. సోమవారం ఉదయం 10.25 గంటలు అలీపుర్దువార్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం ఉదయం రాత్రి 10.25 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక ఈ రైలులో 8 స్లీపర్, 11 సెకండ్ క్లాస్, 1 పాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ ప్రకటించింది. ప్రయాణికులు ఈ రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకుని సౌకర్యంతమైన ప్రయాణం చేయాలని రైల్వేశాఖ సూచించింది. ఈ రైలు బెంగళూరు నుంచి బయల్దేరే సమయంలో ఉదయం 10.09 గంటలకు కుప్పం, రేణిగుంటకు మధ్యాహ్నం 2.30 గంటలకు, నెల్లూరుకు 4.43 గంటలు, ఒంగోలుకు 6.23 గంటలు, చీరాలకు 7.03 గంటలు, తెనాలి 7.53 గంటలు, విజయవాడకు 8.45 గంటలకు చేరుకుంటుంది. ఇక ఏలూరుకు 9.53 గంటలు, రాజమండ్రికి 11.23 గంటలు, సామర్లకొటకు 12.08 గంటలు, అనకాపల్లికి 2.33 గంటలు, దువ్వాడకు 3.50 గంటలకు చేరుకుంటుంది. ఇక పెందుర్తికి 4.18, కొత్తవలసకు 4.28, విజయనగరంకు 5 గంటలు, శ్రీకాకుళంకు 5.58, పలాసకు 7.35 గంటలకు చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది. అటు తిరుగు ప్రయాణంలో విజయవాడకు 12.05 గంటలు, తెనాలికి 12.43, ఒంగోలుకు 2.28 గంటలు, రేణిగుంటకు 7.10, కుప్పంకు 11.43 గంటలకు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే తన ప్రకటనలో పేర్కొంది.
Timings and stoppages of Train No. 16597/16598 — SMVT Bengaluru ↔ Alipur Duar Junction
Amrit Bharat Express (Weekly).
Connecting key stations across multiple states, enhancing long-distance rail connectivity and passenger convenience.#AmritBharatExpress#IndianRailways#SCR pic.twitter.com/cjrizAKucU— South Central Railway (@SCRailwayIndia) January 22, 2026