New Rules: అక్టోబర్‌ 1 నుంచి అమలయ్యే కొత్త నియమాలు.. పెరగనున్న రేట్లు ఇవే.. లిస్టులో మీరున్నారేమో చూడండి..

|

Oct 01, 2023 | 9:29 AM

New rules from 1st October, 2023: దేశంలో అనునిత్యం అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి.. ధరలు, నిబంధనలు, మార్గదర్శకాలు.. ఇలా కొన్ని విషయాల్లో మార్పులతోపాటు.. నియమాలు, నిబంధనలు మారుతుంటాయి. అయితే, ఇవ్వాల్టి నుంచి అక్టోబర్ నెల కూడా మొదలైంది. అక్టోబర్ నెల నుంచి దేశంలో అనేక మార్పులు కనిపించనున్నాయి. ఈ మార్పుల ప్రభావం ప్రజలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

New Rules: అక్టోబర్‌ 1 నుంచి అమలయ్యే కొత్త నియమాలు.. పెరగనున్న రేట్లు ఇవే.. లిస్టులో మీరున్నారేమో చూడండి..
October New Rules
Follow us on

New rules from 1st October, 2023: దేశంలో అనునిత్యం అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి.. ధరలు, నిబంధనలు, మార్గదర్శకాలు.. ఇలా కొన్ని విషయాల్లో మార్పులతోపాటు.. నియమాలు, నిబంధనలు మారుతుంటాయి. అయితే, ఇవ్వాల్టి నుంచి అక్టోబర్ నెల కూడా మొదలైంది. అక్టోబర్ నెల నుంచి దేశంలో అనేక మార్పులు కనిపించనున్నాయి. ఈ మార్పుల ప్రభావం ప్రజలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దీని ప్రభావం ప్రజల జేబులపై పడనుంది. ఇవ్వాల్టి నుంచి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధర కూడా పెరిగనుంది. అయితే, అక్టోబర్ 1 నుంచి దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..? వాటి ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్పీజీ సిలిండర్

వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ.209 మేర ధర పెరిగింది. అటువంటి పరిస్థితిలో పెరిగిన ధర ప్రకారం.. ఢిల్లీలో దీని ధర రూ.1731.50కి చేరింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రూ.209 పెంచాయి.

జీఎస్టీ..

కేంద్ర జీఎస్టీ చట్టంలోని సవరణ ప్రకారం.. ఈ-గేమింగ్, క్యాసినో, గుర్రపు స్వారీ లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిని ‘యాక్షన్ క్లెయిమ్‌లు’గా పరిగణించనున్నారు. వీటిపై 28 శాతం GST విధించనుంది ప్రభుత్వం.. అక్టోబర్ 1 నుంచి తాజా జీఎస్టీ ధరలు అమల్లోకి రానున్నాయి.

TCS నియమాలు

Tax Collection at Source పన్ను వసూలు (TCS) కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయి. మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నట్లయితే.. విదేశీ స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా క్రిప్టోకరెన్సీలను కొనుగోలు చేస్తున్నా లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నా.. ఆర్థిక సంవత్సరంలో మీ ఖర్చులు నిర్దిష్ట పరిమితిని దాటితే TCS చెల్లించాల్సి ఉంటుంది. .

డెబిట్ కార్డ్ – క్రెడిట్ కార్డ్ నియమాలు

అక్టోబరు 1, 2023 నుంచి వివిధ నెట్‌వర్క్‌లలో కార్డ్‌లను అందుబాటులో ఉంచాలని, కస్టమర్‌లు తమ ప్రాధాన్య కార్డ్ నెట్‌వర్క్‌ని ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని RBI బ్యాంకులను ఆదేశించింది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, కార్డ్ జారీచేసేవారు నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..