Renault Kwid: ఆల్టో కారుకు పోటీగా స్పోర్టీ లుక్‌తో నయా రెనాల్ట్‌ క్విడ్‌.. వారే అసలు టార్గెట్‌ అంటున్న కంపెనీ

తాజాగా రెనాల్ట్ ఈ విభాగంలో క్విడ్‌ పేరుతో స్పోర్టీ లుక్‌తో నయా కారును రిలీజ్‌ చేసింది. ఐదుగురి కూర్చొని ప్రయణించగలిగేలా రూపొందించిన ఈ కారు ధర రూ.4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించిది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో కంపెనీ ఐదు వేరియంట్లు అందుబాటులో కంపెనీ ఉంచింది. ఈ కారు క్లైంబర్ వేరియంట్ దాని పూర్తి స్పోర్టీ లుక్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఇంటిగ్రేషన్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ కారు వినియోగదారులను ఆకర్షించనుంది.

Renault Kwid: ఆల్టో కారుకు పోటీగా స్పోర్టీ లుక్‌తో నయా రెనాల్ట్‌ క్విడ్‌.. వారే అసలు టార్గెట్‌ అంటున్న కంపెనీ
Renault Kwid

Updated on: Sep 09, 2023 | 7:30 PM

అధునాతన ఫీచర్లతో కూడిన సరసమైన ధరలో కారును రూపొందించడం అనేది ప్రతి కారు తయారీదారులకు సవాలుగా మారింది. అయితే తాజాగా రెనాల్ట్ ఈ విభాగంలో క్విడ్‌ పేరుతో స్పోర్టీ లుక్‌తో నయా కారును రిలీజ్‌ చేసింది. ఐదుగురి కూర్చొని ప్రయణించగలిగేలా రూపొందించిన ఈ కారు ధర రూ.4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించిది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో కంపెనీ ఐదు వేరియంట్లు అందుబాటులో కంపెనీ ఉంచింది. ఈ కారు క్లైంబర్ వేరియంట్ దాని పూర్తి స్పోర్టీ లుక్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఇంటిగ్రేషన్‌తో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ కారు వినియోగదారులను ఆకర్షించనుంది. ఈ కారు లీటరుకు 22.3 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ సూపర్ స్పోర్టీ కారు మార్కెట్లో మారుతి ఆల్టో కె10, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోతో పోటీపడుతుంది.

సూపర్‌ డిజైన్‌ 

రెనాల్ట్ క్విడ్‌ కారు 279 లీటర్ల బూట్ స్పేస్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. రెనాల్ట్ క్విడ్‌ ఎడ్జస్టబుల్‌డ్రైవర్ సీటుతో పాటు కీలెస్ ఎంట్రీతో వస్తుంది. డ్రైవర్ సీటు 4 వే అడ్జస్టబిలిటీని అందిస్తుంది. అదనపు సౌలభ్యం కోసం కీలెస్ ఎంట్రీతో అనుబంధంగా ఉంటుంది. రూ. 6.33 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభించే టాప్-టైర్ మోడల్‌లో మాన్యువల్ ఏసీతో పాటు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసేలా ఓఆర్‌వీఎంలు ఉన్నాయి.

భద్రతకు ప్రాధాన్యం

బలమైన 999 సీసీ పెట్రోల్ ఇంజన్ రెనాల్ట్ క్విడ్‌కు శక్తినిస్తుంది. ఆకట్టుకునే 67.06 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌ భద్రతా చర్యలను మెరుగుపరుస్తాయి. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్‌), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్‌) కారులో ఇచ్చారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఏబీఎస్‌ భద్రతా చర్యలను మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎంపికల ప్యాలెట్‌

రెనాల్ట్‌ క్విడ్‌ ఏడు ఆకర్షణీయమైన రంగు ఎంపికల స్పెక్ట్రమ్‌లో అందజేస్తుంది. రెనాల్ట్‌ క్విడ్‌పై రూ. 67,000 వరకు గణనీయమైన తగ్గింపును అందిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి చెప్పుకోదగిన అధునాతన ఫీచర్లు సుసంపన్నమైన డ్రైవింగ్ అనుభవానికి దోహదం చేస్తాయి.

కారు పనితీరు

రెనాల్ట్‌ క్విడ్‌ శక్తివంతమైన ఇంజన్ ఫైవ్‌ స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపిక ద్వారా 91 ఎన్‌ఎం ఆకట్టుకునే టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెనాల్ట్ క్విడ్‌ క్లైంబర్ వేరియంట్ టాటా పంచ్‌తో కూడా పోటీపడుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి