Poco M7 pro: అదిరే ఫీచర్లతో మార్కెట్ లోకి కొత్త ఫోన్.. పోకో ఎం7 ప్రో విడుదల

|

Dec 18, 2024 | 6:49 PM

దేశంలో పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ అవసరం రోజురోజుకూ ఎక్కువవుతోంది. మనిషికి అత్యవసరమైన కనీస వస్తువుల జాబితాలో చేరిపోయింది. దీంతో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పలు కంపెనీల నుంచి అనేక మోడళ్లు మార్కెట్ లో విడుదల అవుతున్నాయి. వీటిలో తక్కువ ధరకు, బెస్ట్ ఫీచర్లతో లభించే ఫోన్లలో పోకో ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ మోడళ్లకు మన దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది.

Poco M7 pro: అదిరే ఫీచర్లతో మార్కెట్ లోకి కొత్త ఫోన్.. పోకో ఎం7 ప్రో విడుదల
Poco M7 Pro
Follow us on

పోకో ఎం7 ప్రో అనే 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలైంది. దాని ప్రత్యేకతలు, ధర వివరాలు తెలుసుకుందాం. పోకో ఎం7 (5జీ) స్మార్ట్ ఫోన్ రూ.13,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ సెగ్మెంట్ లో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న ఫోన్ ఇదే కావడం విశేషం. దీనిలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ఎస్వోసీ, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రకాల వేరియంట్లలో కొత్త పోకో స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,999 అలాగే 8 జీబీ, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999 పలుకుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్ సెట్ ప్రాసెసర్ కారణంగా ఫోన్ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. గేమింగ్ తో పాటు రోజు వారీ పనులు చేసుకోవడానికి వీలుంటుంది.

6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే కారణంగా విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్మూత్ గా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. అదనపు మన్నిక కోసం స్క్రీన్ గొరిల్లా గ్లాస్ ను ఏర్పాటు చేశారు. కెమెరా సెటప్ ను అద్భుతంగా అమర్చారు. 50 మెగా పిక్సల్ సోనీ ల్వెతియా ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సార్, 2 మెగా ఫిక్సల్ మాక్రో సెన్సార్, సెల్పీలు, వీడియోల కోసం 20 మెగా పిక్సల్ సెన్సార్ కెమెరాతో స్పష్టమైన చిత్రాలు, వీడియోలు తీసుకోవచ్చు. కొత్త స్మార్ట్ ఫోన్ లో హైపర్ ఓఎస్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ 14 పై ఆధారపడి పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్లు అందించనున్నారు. స్పష్టమైన ఆడియో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

స్లైలిష్ డిజైన్, మంచి కెమెరా సెటప్ తో రూపొందించిన పోకో ఎం7 ప్రో ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రెడ్ మీ, లావా తదితర వాటికి పోకో ఎం7 ప్రో మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి