New LPG Cylinder Rules: షాకింగ్.. వీళ్లు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సరెండర్ చేయాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్!
New LPG Cylinder Rules: మీరు కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించిన సిలిండర్ మరియు రెగ్యులేటర్ తాలూకు సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని గ్యాస్ ఏజెన్సీ మీకు తిరిగి ఇచ్చేస్తుంది. బకాయిలు లేదా పరికరాలు పాడైపోతే మినహాయింపులు పోను మిగిలిన మొత్తం మీ బ్యాంక్..

New LPG Cylinder Rules: ప్రస్తుతం అంతర్జాతీయంగా పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదాల వల్ల చమురు, గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం “ఒకే ఇల్లు – ఒకే గ్యాస్ కనెక్షన్” (One Household, One Gas Connection) విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.
మీ ఇంట్లో గనుక పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉంటే, మీరు ఖచ్చితంగా మీ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్‌ను (ఇండేన్, హెచ్‌పీ లేదా భారత్ గ్యాస్ ఏదైనా సరే) సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉండటాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడం ద్వారా గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, సబ్సిడీ దుర్వినియోగాన్ని ఆపడం, నిజంగా గ్యాస్ సిలిండర్ అవసరమున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
ఎవరి గ్యాస్ కనెక్షన్ కట్ అవుతుంది?
పీఎన్‌జీ (PNG) ఉన్న ఇళ్లు: మార్చి 24, 2026 నాటి ప్రభుత్వ నోటీసు ప్రకారం, మీ సొసైటీ లేదా ఇంట్లో పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు ఉండి, గ్యాస్ పైప్‌లైన్ వాడుతుంటే.. 90 రోజుల్లోగా (జూన్ 24, 2026 లోపు) ఎల్‌పీజీ సిలిండర్‌ను సరెండర్ చేయాలి. గడువులోగా చేయకపోతే మీ ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా నిలిపివేస్తారు. గ్యాస్ పైప్‌లైన్ వేయడానికి నిరాకరించే లేదా ఆలస్యం చేసే అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు (RWA) ఉంటే, ఆ బిల్డింగ్ మొత్తానికి ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేస్తారు. అలాగే గృహ అవసరాలకు ఇచ్చే (Domestic) సిలిండర్లను కమర్షియల్ వ్యాపారాల కోసం వాడితే తక్షణమే కనెక్షన్ రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఎవరి కనెక్షన్ సురక్షితంగా ఉంటుంది?
మీ ప్రాంతంలో అసలు పీఎన్‌జీ (PNG) పైప్‌లైన్ సదుపాయమే లేకపోతే, మీకు ఈ 3 నెలల గడువు వర్తించదు. మీరు యథావిధిగా సిలిండర్ వాడుకోవచ్చు. గ్రామీణ, పీఎన్‌జీ లేని పట్టణ ప్రాంతాల ప్రజలకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా కొనసాగుతుంది (అయితే రీఫిల్లింగ్ బుకింగ్ గ్యాప్ పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులుగా నియంత్రించవచ్చు). మీ ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తయి ఉంటే మీ కనెక్షన్ సురక్షితంగా ఉంటుంది.
ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌ను ఆన్‌లైన్‌లో సరెండర్ చేయడం ఎలా?
వినియోగదారులు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన అధికారిక MYPNGD పోర్టల్ (https://mypngd.in/) ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా వెరిఫికేషన్, సరెండర్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
- వెబ్‌సైట్ విజిట్ చేయండి: మొదట అధికారిక వెబ్‌సైట్ https://mypngd.in/ లోకి వెళ్లాలి.
- తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మీ ఎల్‌పీజీ ఐడీ (LPG ID) ని ఎంటర్ చేయండి.
- స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘Get OTP’ పై క్లిక్ చేయాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి.
- సరెండర్ రిక్వెస్ట్: మీ నంబర్‌కు లింక్ అయిన గ్యాస్ కనెక్షన్ వివరాలు అక్కడ కనిపిస్తాయి. అక్కడ డిజిటల్‌గా మీ సరెండర్ అభ్యర్థనను సబ్మిట్ చేయవచ్చు. (ఇండేన్ వినియోగదారులు వారి అధికారిక యాప్/వెబ్‌సైట్ ద్వారా కూడా బర్త్‌డే మరియు రిఫరెన్స్ నంబర్ ఇచ్చి సరెండర్ చేయవచ్చు).
ఇది కూడా చదవండి: Tiger Facts: పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? ఫారెస్ట్ ఆఫీసర్ మాటల్లో షాకింగ్ నిజాలు
ఆఫ్‌లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ సరెండర్ చేసే విధానం:
- మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీ (డిస్ట్రిబ్యూటర్) వద్దకు వెళ్లి కూడా కనెక్షన్ క్లోజ్ చేయవచ్చు.
కావలసిన పత్రాలు:
- ఒరిజినల్ సబ్‌స్క్రిప్షన్ వోచర్ (SV) లేదా గ్యాస్ పాస్‌బుక్ (DGCC Booklet).
- ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు.
- పాన్ కార్డ్ (అవసరమైతే).
- డిపాజిట్ డబ్బు రీఫండ్ పొందడానికి బ్యాంక్ ఖాతా వివరాలు.
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
లేదా..
- మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకు వెళ్లండి.
- అక్కడ లభించే LPG Surrender/Closure Form ని పూర్తిగా నింపి సబ్మిట్ చేయండి.
- మీ వద్ద ఉన్న ఖాళీ లేదా నిండు గ్యాస్ సిలిండర్, ప్రెజర్ రెగ్యులేటర్ (Regulator) ను ఏజెన్సీకి అప్పగించండి.
- రశీదు (Acknowledgement), రీఫండ్ రశీదును తీసుకోండి.
- డిస్ట్రిబ్యూటర్ మీకు ఒక టెర్మినేషన్ వోచర్ (Termination Voucher – TV) ఇస్తారు. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది (భవిష్యత్తులో మళ్లీ కనెక్షన్ కావాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది).
సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ రూల్స్:
మీరు కనెక్షన్ తీసుకునే సమయంలో చెల్లించిన సిలిండర్ మరియు రెగ్యులేటర్ తాలూకు సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని గ్యాస్ ఏజెన్సీ మీకు తిరిగి ఇచ్చేస్తుంది. బకాయిలు లేదా పరికరాలు పాడైపోతే మినహాయింపులు పోను మిగిలిన మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price: గుడ్‌న్యూస్.. భారీ పతనం.. తులంపై రూ.5 వేలు తగ్గిన బంగారం ధర..!
ఇది కూడా చదవండి: Personal Finance: నెలకు రూ. 1,000 పెట్టుబడితో రూ. 54 లక్షల ఫండ్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




