పండుగలాంటి వార్త.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!

ఊహించినట్టుగానే గేమ్‌ఛేంజర్‌ లాంటి నిర్ణయాలను ప్రకటించింది జీఎస్టీ కౌన్సిల్‌. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్‌ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లను సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం.

పండుగలాంటి వార్త.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!
New Gst Rates

Updated on: Sep 04, 2025 | 6:58 AM

ఊహించినట్టుగానే గేమ్‌ఛేంజర్‌ లాంటి నిర్ణయాలను ప్రకటించింది జీఎస్టీ కౌన్సిల్‌. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్‌ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లను సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం.

దేశ ప్రజలకు సూపర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం. జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. నిత్యవసర వస్తువులపై కలలో కూడా ఊహించనివిధంగా పన్నులను తగ్గించింది. కొన్నింటిపై అయితే మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. కేవలం రెండే రెండు స్లాబులను ప్రకటించింది. ఒకటి ఐదు శాతం, రెండోది 18శాతం.. అయితే, లగ్జరీ ఐటెమ్స్‌పై 40 పర్సెంటేజ్‌ విధించింది.

33 ప్రాణాధార ఔషధాలు, లైఫ్‌-హెల్త్‌-టర్మ్‌ బీమా పాలసీలు, పర్సనల్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌లపై పూర్తిగా GSTని ఎత్తేసింది కేంద్రం. అలాగే, స్టూడెంట్స్‌కి అవసరమైన మ్యాప్స్‌, చార్ట్స్‌, గ్లోబ్స్‌, పెన్సిల్స్‌, షార్ప్‌నర్స్‌, ఎరైజర్స్‌, నోట్‌బుక్స్‌పై GSTని పూర్తిగా తొలగించింది. గతంలో వీటన్నింటిపై 5నుంచి 12శాతం GST ఉండేది.

నిత్యవసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, పాల ఉత్పత్తులు, బేబీ కేర్‌, ఫర్టిలైజర్స్‌.. ఇలా అనేక వస్తువులపై ఇప్పటివరకు 12 నుంచి 18శాతమున్న GSTని 5శాతానికి తగ్గించింది. ఇందులో హెయిర్‌ ఆయిల్‌, టూత్‌పేస్ట్‌, సబ్బులు, టూత్‌బ్రెష్‌లు, షేవింగ్‌ క్రీమ్‌.. బటర్‌, నెయ్యి, చీజ్‌, డెయిరీ ప్రొడక్ట్స్‌, ప్రీప్యాక్డ్‌ నమ్‌కీన్స్‌, కాఫీ-టీ ఉత్పత్తులు.. ప్యాకేజ్డ్‌ చపాతీ, రోటి, పరోటా.. డ్రై ఫ్రూట్స్‌ అండ్‌ నట్స్‌.. సీ-ఫుడ్‌.. ఐస్‌క్రీమ్స్‌, ఫ్రొజెన్‌ ఫుడ్స్‌.. ఫ్రూట్‌ డ్రింక్స్‌, బేవరేజెస్‌.. బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్స్‌, పన్నీర్‌-చెనా, సాస్‌ అండ్‌ సలాడ్స్‌, జామ్ అండ్‌ జెల్లీస్‌, ప్లాంట్‌ బేస్డ్‌ మిల్క్‌.. చిన్నపిల్లలకు వాడే నాప్కిన్లు, డైపర్లు, ఫీడింగ్‌ బాటిల్స్‌.. డయాగ్నోసిస్‌ పరికాలు, మెడిసిన్స్‌, పరికరాలు, కళ్లద్దాలు.. ట్రాక్టర్‌ విడిభాగాలు.. సైకిల్స్‌.. బయో పెస్టిసైడ్స్‌, బిందుసేద్యం పరికరాలు ఉన్నాయి.

ఆ తర్వాత 18శాతం స్లాబ్‌.. ఇందులో సిమెంట్‌, టూవీలర్స్‌ అండ్ త్రీవీలర్స్‌, చిన్న కార్లు, 350 సీసీ కంటే తక్కువ వాహనాలు, ఏసీలు, టీవీలు, క్లీనింగ్‌ ఉత్పత్తులు, మానిటర్స్ అండ్‌ ప్రొజెక్టర్స్‌ ఇందులో ఉన్నాయి. గతంలో వీటన్నింటిపై 28శాతం GST ఉండగా.. దాన్నిప్పుడు 18శాతానికి తగ్గించారు. ఇక ఫైనల్‌గా 40 పర్సంటేజ్‌ స్లాబ్‌.. ఇందులో దాదాపు విలాసవంతమైన వస్తువులను చేర్చింది. 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్‌ కార్లు.. పాన్‌ మసాలా, సిగరెట్‌, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తులు.. కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్‌పై అత్యధికంగా 40శాతం పన్ను విధించింది.

రైతులు, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నెక్ట్స్‌ జనరేషన్‌ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ జీఎస్టీ సంస్కరణలు.. పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుందన్నారు. పేద-మధ్యతరగతితోపాటు వ్యవసాయ-వైద్యరంగాల్లో కొత్త జీఎస్టీ స్లాబ్స్‌.. గేమ్‌ ఛేంజర్‌గా మారతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..