Evolet Pony Classic EV: మార్కెట్‌లోకి నయా ఈవీ రూ.60,000కే బోలెడన్ని ఫీచర్లతో స్కూటర్‌ విడుదల

|

Jul 01, 2023 | 5:30 PM

చాలా కంపెనీలు కొత్త మోడల్స్‌ ఈవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ ఎండ్‌ కంపెనీల వరకూ నయా ఈవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఎవోలెట్ పోనీ అనే ఈవీ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఈ స్కూటర్లు  రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో బేస్‌ మోడల్‌ పోనీ ధర రూ. 41,124గా ఉంటే, ఉత్తమ మోడల్ ధర రూ. 55,799గా ఉంది.

Evolet Pony Classic EV:  మార్కెట్‌లోకి నయా ఈవీ రూ.60,000కే బోలెడన్ని ఫీచర్లతో స్కూటర్‌ విడుదల
Evolet Pony
Follow us on

భారతదేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. అయితే పెరిగిన పెట్రోల్‌ ధరల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు కొత్త మోడల్స్‌ ఈవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. స్టార్టప్‌ కంపెనీల నుంచి టాప్‌ ఎండ్‌ కంపెనీల వరకూ నయా ఈవీలను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఎవోలెట్ పోనీ అనే ఈవీ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది. ఈ స్కూటర్లు  రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో బేస్‌ మోడల్‌ పోనీ ధర రూ. 41,124గా ఉంటే, ఉత్తమ మోడల్ ధర రూ. 55,799గా ఉంది. ఎవోలెట్ పోనీ మోటారు 250 వాట్స్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎవోలెట్ పోనీలో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు, అలాగే ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ స్కూటర్‌ ఇతర ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

వేరియంట్ వారీగా పరిధి, గరిష్ట వేగం

పోనీ ఈజెడ్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే సమయంలో క్లాసిక్ వేరియంట్‌ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. రెండింటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. స్కూటర్ సీటు ఎత్తు 800 మిమీ. అలా కాకుండా ప్రామాణిక ఛార్జర్‌ని ఉపయోగించి బ్యాటరీని 4 నుండి 5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

బ్యాటరీలు ఇలా

ఈవోలెట్‌ పోనీ పేరు సూచించినట్లుగా, కొలతల పరంగా కంపెనీ యొక్క అతి చిన్న ఈ-స్కూటర్. ఇది 250 వాట్ల పవర్ అవుట్‌పుట్‌తో వాటర్‌ప్రూఫ్ బీఎల్‌డీసీ మోటార్‌కు శక్తినిచ్చే లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. పోలో పోనీ రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది: పోలో పోనీ ఈజెడ్‌ 48వీ/24ఏహెచ్‌ వీఆర్‌ఎల్‌ఏ బ్యాటరీతో వస్తుంది. 48వీ/24ఏహెచ్‌ లిథియం అయాన్ బ్యాటరీతో పోలో పోనీ క్లాసిక్ ఆకర్షణీయంగా ఉంటుంది అయితే ఎవోలెట్ పోనీని లీడ్-యాసిడ్ బ్యాటరీతో రావడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..