రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త మార్గదర్శకాలలో క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన నిబంధనలను మార్చింది. కొత్త నిబంధనలు 1 జూలై 2022 నుండి అమలులోకి వస్తాయి. ఇందులో క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించిన నియమాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొత్త నిబంధనలు రాష్ట్ర సహకార, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మినహా అన్ని బ్యాంకులకు వర్తిస్తాయని నోటిఫికేషన్‌లో RBI తెలియజేసింది. క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జూలై 1 నుంచి వర్తిస్తాయి.
సమ్మతి లేకుండా కార్డులు జారీ చేయరాదు
జూలై 1 నుంచి ఏ బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ జారీ చేసే కంపెనీ కస్టమర్ల సమ్మతి లేకుండా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడం సాధ్యం కాదని RBI స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇదే జరిగితే, కార్డు జారీ చేసే కంపెనీకి జరిమానా విధించబడుతుంది. ఖాతాదారులకు ఎలాంటి తప్పుడు బిల్లులు పంపబడవని బ్యాంకులు ఖాతాదారులకు చెప్పల్సి ఉంటుంది. ఇదే జరిగితే, కార్డు జారీ చేసే సంస్థలు దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన తేదీ నుంచి గరిష్టంగా 30 రోజులలోపు కార్డుదారు ప్రతిస్పందించవలసి ఉంటుంది.
ఇప్పుడు బిల్లింగ్ సైకిల్ 11 నుంచి ప్రారంభమవుతుంది
బిల్లు జనరేట్ అయిన తర్వాత క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు సమయం నిర్ణయించబడుతుంది. కానీ ఇప్పుడు జూలై 1, 2022 నుంచి మీ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ప్రారంభం అవుతుంది. నెల 11 నుంచి తదుపరి నెల 10వ తేదీ వరకు ఉంటుంది.
తప్పుడు బిల్లులను పంపవద్దు
క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థ వినియోగదారులకు ఎటువంటి తప్పుడు బిల్లును పంపకుండా చూసుకోవాలి. ఇదే జరిగితే సంస్థలే దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన తేదీ నుండి గరిష్టంగా 30 రోజులలోపు కార్డుదారు రుజువుతో ప్రతిస్పందించవలసి ఉంటుంది.
కస్టమర్లకు సకాలంలో బిల్లు స్టేట్ మెంట్ పంపేందుకు కంపెనీకి రోజుకు రూ.500 జరిమానా విధిస్తారు . అలాగే, కస్టమర్లకు చెల్లింపులు చేయడానికి తగినంత సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వడ్డీ వసూలు చేయాలి. క్రెడిట్ కార్డ్ జారీచేసేవారి అభ్యర్థన మేరకు 7 రోజుల్లోగా కార్డ్ మూసివేయబడాలి. క్రెడిట్ కార్డ్ మూసివేయబడిన తర్వాత, దాని గురించి వెంటనే ఇమెయిల్, SMS ద్వారా కార్డ్ హోల్డర్‌కు తెలియజేయాలి. ఇది జరగకపోతే, కంపెనీకి రోజుకు రూ. 500 జరిమానా విధించబడుతుంది. కానీ కార్డ్‌లో బకాయి ఉన్న బ్యాలెన్స్ లేనప్పుడు ఇది వర్తిస్తుంది.