BMW XM: సూపర్ మైలేజ్‌తో బీఎండబ్ల్యూ నయా కారు.. ఆ ప్రీమియం కార్లకు గట్టి పోటీ

|

Oct 06, 2024 | 8:45 PM

సాధారణంగా ప్రీమియం కార్లు అనేవి సూపర్ స్పీడ్‌తో పాటు స్టైలిష్ లుక్‌తో వస్తాయని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా ఈ కార్ల మైలేజ్ చాల తక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కారు నయా మోడల్ కొనుగోలుకు ఔత్సాహికులు క్యూ కడుతూ ఉంటారు.  4.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన కారు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని ఎవరూ ఊహించరు. కానీ ఇది నిజమే.

BMW XM: సూపర్ మైలేజ్‌తో బీఎండబ్ల్యూ నయా కారు.. ఆ ప్రీమియం కార్లకు గట్టి పోటీ
Bmw Xm
Follow us on

సాధారణంగా ప్రీమియం కార్లు అనేవి సూపర్ స్పీడ్‌తో పాటు స్టైలిష్ లుక్‌తో వస్తాయని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా ఈ కార్ల మైలేజ్ చాల తక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ కారు నయా మోడల్ కొనుగోలుకు ఔత్సాహికులు క్యూ కడుతూ ఉంటారు.  4.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన కారు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని ఎవరూ ఊహించరు. కానీ ఇది నిజమే. బీఎండబ్ల్యూ ఇటీవల విడుదల చేసిన ఎక్స్ఎం వేరియంట్‌లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఈ స్థాయి మైలేజ్ అందిస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారు లంబోర్ఘిని ఉరస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్‌లతో పోటీపడుతుంది. ఈ నేపథ్యంలో బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారు ధర రూ. 2.60 కోట్లు(ఎక్స్-షోరూమ్). ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 4.4 లీటర్ ట్విన్-టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ సెటప్ 653 పీఎస్, 800 ఎన్ఎం ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారు కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు సంయుక్త సీఓ2 ఉద్గారాలు కిలోమీటర్‌కు 36.5 గ్రాములుగాఉన్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారు 69 లీటర్ ఇంధన ట్యాంక్‌తో వస్తుంది. ఇది ఫుల్ ట్యాంక్‌తో పాటు 100 శఆతం బ్యాటరీ ఛార్జ్‌పై సుమారు 4271 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని బీఎండబ్ల్యూ ప్రతినిధులు చెబుతున్నారు. 

బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారులో 14.9 అంగుళాల కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, బోవర్స్ & విల్కిన్స్ 1500 వాట్ డైమండ్ సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈబీడీతో వచ్చే ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ కారు మైలేజ్‌తో అధునాతన భద్రతా ఫీచర్లు కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..