Google Pay: మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మరిచిపోతున్నారా.. అయితే ఇలా ఈజీగా చెల్లించవచ్చు.. ఎలాగంటే..

|

Aug 02, 2023 | 9:15 PM

Google Pay Payment Reminder: మీరు కరెంటు బిల్లు చెల్లించడం మరిచిపోయారా.. మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారా.. టెలిఫోన్ బిల్లు కట్టలేకోయారా.. అరే..! ఇలాంటి పనులను గుర్తు చేసేందుకు ఒకరు ఉంటే ఎంత బాగుండు అని మనలో చాలా మందికి అనిపిస్తుంది. కానీ మనం ఓ పీఏను ఏర్పాటు చేసుకోలేం కాదా.. అలాంటి పనులను ఎవరైనా చేస్తే.. అలాంటి మంచి సౌకర్యాన్ని జీ పే అందిస్తోంది. మనం చెల్లించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుంది. దీనికి మనం చేయాల్సింది ఒకటే గూగుల్ పేలో ఆ ఆప్షన్ ను ఎంచుకోవడం మాత్రమే.. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

Google Pay: మీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడం మరిచిపోతున్నారా..  అయితే ఇలా ఈజీగా చెల్లించవచ్చు.. ఎలాగంటే..
G Pay
Follow us on

ప్రతి ఒక్కరు ప్రతి నెల కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, నల్లా బిల్లు సహా అన్ని రకాల బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్లులను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కొన్ని సార్లు మరిచిపోతుంటాం. ఇలాంటి సమయంలో ఫైన్లు కూడా కలిపి కట్టాల్సి ఉంటుంది. ఈ బిల్లులను గుర్తు పెట్టుకుని ఒకరు చెబితే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. అరే..! ఇలాంటి పనులను గుర్తు చేసేందుకు ఒకరు ఉంటే ఎంత బాగుండు అని మనలో చాలా మందికి అనిపిస్తుంది. కానీ మనం ఓ పీఏను ఏర్పాటు చేసుకోలేం కాదా.. అలాంటి పనులను ఎవరైనా చేస్తే.. అలాంటి మంచి సౌకర్యాన్ని జీ పే అందిస్తోంది. మనం చెల్లించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తుంది. అయితే వీటన్నింటిని గుర్తుపెట్టుకుని.. సమయానికంటే ముందే.. డేట్, సమయం గుర్తు చేసే మనకు గుర్తు చేసే ఓ కొత్త ఫీచర్ ను గూగుల్ పే తీసుకొచ్చింది. బిల్లు జనరేట్ అయిన వెంటనే మీకు రిమాండర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది.

భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే చెల్లింపు వ్యవస్థలలో Google Pay ఒకటి. మొబైల్ వాలెట్ వినియోగదారులను చెల్లింపు రిమైండర్‌లను సెట్ చేయడానికి అనుమతిస్తుంది, తద్వారా మీరు అద్దె, మెంటెనెన్స్ ఛార్జీలు, వార్తాపత్రిక బిల్లు, కిరాణా వంటి చెల్లింపులను మరిచిపోరు.

రిమైండర్ ఎలా సెట్ చేసుకోవాలి…

ముందుగా గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే రకరకాల పేమెంట్స్, కేటగిరీలు వస్తాయి.

  • అందులో మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవలి
  • ఇప్పుడు ఆ పేమెంట్ కు సంబంధించిన వివరాలు వస్తాయి
  • అందులో ఎరికి చెల్లించాలి
  • ఎప్పుడు చెల్లించాలి
  • ప్రారంభ తేదీ
  • చివరి తేదీ
  • పేమెంట్ ఫ్రీక్వెన్సీ
  • తర్వాత సెట్ రిమైండర్ పై క్లిక్ చేస్తే సమయానికి నోటిఫికేషన్ వచ్చేస్తుంది.

ఇలా నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది.. పేమెంట్ మాత్రం చేయదు. మీరు మాత్రమే ఈ పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా మీరు మరిచిపోయి.. ఫైన్ పడకుండా మీ జేబుకు చిల్లు పడకుండా మీకు ఆర్ధిక రక్షణ కల్పిస్తోంది గూగుల్ పే.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం