NPS Account: ఆన్‌లైన్‌లో NPS ఖాతాకు ఆధార్‌ నంబర్‌ను ఎలా లింక్‌ చేయాలి..!

|

Feb 18, 2022 | 10:42 AM

NPS Account: నేషనల్‌ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది భారతీయులకు వృద్ధాప్యంలో భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఇది. ఈ పథకం పెన్షన్ ఫండ్..

NPS Account: ఆన్‌లైన్‌లో NPS ఖాతాకు ఆధార్‌ నంబర్‌ను ఎలా లింక్‌ చేయాలి..!
Follow us on

NPS Account: నేషనల్‌ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది భారతీయులకు వృద్ధాప్యంలో భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఇది. ఈ పథకం పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ మరియు డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA)చే కొనసాగుతుంది. అనేక సేవలను పొందేందుకు ప్రభుత్వం NPS ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రయోజనాలను పొందేందుకు 2021 ఆగస్టులో ఈ పథకం కింద ప్రయోజనాలు అందుకునే వారు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఆధార్‌కు బదులుగా పాన్‌ను ఉపయోగించి తమ ఎన్‌పిఎస్ ఖాతాను తెరిచిన వ్యక్తులు ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. అయితే NPS ఖాతాకు ఆధార్‌ అప్‌డేట్‌ చేయడం ఎలానో తెలుసుకోండి.

1) ముందుగా లింక్ ద్వారా మీ NPS ఖాతాకు లాగిన్ అవ్వండి.

2) ‘అప్‌డేట్ ఆధార్/చిరునామా వివరాల’పై క్లిక్ చేయండి.

3) తర్వాత మెను కింద ఆధార్ నంబర్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

4) మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, జనరేట్‌ OTP’పై క్లిక్ చేయండి.

5) మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో UIDAI నుండి అందుకున్న OTPని నమోదు చేయండి. దీంతో ఆధార్‌ లింక్‌ అవుతుంది.

6) తర్వాత మీ ప్రక్రియ విజయవంతం అయినట్లు సందేశం వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Soaps, Detergents Price: వినియోగదారులకు షాక్‌.. సబ్బులు, సర్ఫ్‌లు ప్రియం..!

RBI: మొండి రుణ అకౌంట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. అలా చేస్తేనే స్టాండర్డ్‌ ఖాతాగా మారవచ్చు..!